Swastika mukherjee steals in singapore caught by cctv

swastika mukherjee robbery, swastika mukherjee latest news, swastika mukherjee stealing in singapore, swastika mukherjee next movie, cctv scandals, bengal heroines, latest news, singapore tourism, singapore shopping latest

swastika mukherjee steals in singapore caught by cctv : bengal actress swastika mukerjee stolen an article in a shop in singapore cc tv video shows about robbery and complained about her cheap activity

సీసీటీవీలో బుక్కయింది... పరువు తీసింది !!

Posted: 11/05/2014 04:54 PM IST
Swastika mukherjee steals in singapore caught by cctv

డబ్బులు లేక దొంగతనం చేశారు అంటే.., జాలి పడి వదిలేయవచ్చు. కాని చేతినిండా డబ్బు ఉండి చేతివాటం ప్రదర్శిచారంటే ఏమనాలి. బెంగాలి హీరోయిన్ స్వస్తిక ముఖర్జీ ఓ షాపులో దొంగతనం చేసి అడ్డంగా బుక్కయింది. తెలిసే చేసిందో లేక తెలియక మర్చిపోయి చేసిందో అమ్మడికే తెలియాలి కానీ... పరాయిగడ్డపై ఇండస్ర్టీ పరువు మాత్రం తీసేసింది. ఓ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్ళిన స్వస్తిక తన బాయ్ ఫ్రెండ్, ఫిలిం మేకర్ సుమన్ ముఖర్జీతో కలిసి షాపింగ్ చేసిందట. తెగ తిరిగేసి ఏవేవో కొనేసింది. ఆ క్రమంలో ఓ షాజపులో 225 డాలర్ల విలవున వస్తువుకు బిల్లు కట్టకుండానే తెచ్చేసిందట.

స్వస్తిక డబ్బులు కట్టకుండా సామాను తీసుకోవటం సీసీ టీవీ ద్వారా గుర్తించిన షాప్ నిర్వాహకులు ఇదేం పని అని ఫిలిం ఫెస్టివల్ వారిని అడిగారట. కావాలంటే వీడియో చూడండి అని సీసీ టీవీ రికార్డింగ్ చూపించారని తెలిసింది. అంతేకాకుండా ఫెస్టివల్ నిర్వాహకుల్లో ఒకరిగా ఉన్న వ్యక్తి ఫ్రెండ్ దే షాప్ కావటంతో స్నేహితుడి వద్ద చాలా ఇబ్బంది పడినట్లు బెంగాలి ఫిలిం వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఫెస్టివల్ నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. డబ్బులు కట్టకుండా తీసుకొచ్చిన వస్తువులకు తాము చెల్లిస్తామని ఒప్పుకున్నారట. దీంతో ఈ వివాదం ముగిసింది.

ఇక ఈ విషయంపై తమతో మాట్లాడవద్దని ఫిలింఫిస్టివల్ మేనేజ్మెంట్ మీడియాను కోరింది. మరోవైపు చిలిపి చేష్టలపై స్పందించేందుకు కూడా స్వస్తిక ఆసక్తి చూపటంలేదు. కావాలని చేసిందా.., లేక మర్చిపోయి తీసుకొచ్చిందా అనేది అమ్మడు నోరు విప్పితేనే బయటకు వస్తుంది. మరో విషయం ఏమిటంటే.., వివాదాలు తెచ్చుకోవటం స్వస్తికకు ఇది కొత్తేమి కాదు. గతంలో ఓ సారి బాయ్ ఫ్రెండ్ తో గొడవపడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ లో 8Detective Byomkesh Bakshy’ అనే సినిమాలో నటిస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swastika mukherjee  robbery  singapore  cc tv  

Other Articles