Bipasha basu to act as modern mother character in vikram phadnis director who is a famous fashion designer

bipasha basu, bipasha basu hot photos, bipasha basu latest news, bipasha basu hot gallery, bipasha basu photo shoot, bipasha basu bikini photos, bipasha basu rumours, bipasha basu affairs, bipasha basu harman baweja, bipasha basu john abraham

bipasha basu to act as modern mother character in vikram phadnis director who is a famous fashion designer from last 25 years in the bollywood

షాకింగ్ : తల్లికాబోతున్న డస్కీ బ్యూటీ!

Posted: 11/05/2014 12:59 PM IST
Bipasha basu to act as modern mother character in vikram phadnis director who is a famous fashion designer

తరుచూ ఎఫైర్లతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ డస్కీబ్యూటీ బిపాషాబసు త్వరలోనే తల్లికాబోతోందని వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ అమ్మడు తన మాజీ ప్రేమికుడైన జాన్ అబ్రహాంతో సహజీవనం చేసిన నేపథ్యంలో ఇటువంటి వార్తలే వచ్చాయి గానీ.. అప్పట్లో అవి కేవలం రూమర్లే అని తేలిపోయాయి. అయితే ప్రస్తుతం ఈ మూడుపదుల భామ హర్మమ్ బవేజా అనే యాక్టర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనే విషయం తెలిసిందే! అతనితో ఎప్పుడుపడితే అప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరుగడం, విదేశాలకు టూర్లకు వెళ్లడం అంతా జరిగిపోయింది కూడా! ఇక విషయానికొస్తే.. తాజాగా ఈ అమ్మడు త్వరలోనే తల్లి కాబోతోందని తెలుస్తోందని బాలీవుడ్ సమాచారం! అయితే.. ఇది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో మాత్రమే!

గతకొంతకాలం నుంచి ఈ అమ్మడు సినిమాల విషయంలో చాలా సైలైంటుగా అయిపోయినట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు అరకొర సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడిపోవడంతో ఈ భామ పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తోంది. గతంలోలాగా కేవలం అందాలను ఆరబోసే పాత్రలు కాకుండా వైవిధ్యభరితమైన పాత్రల కోసం ఎదురుచూస్తోందని స్వయంగా ఆమె పేర్కొన్న సందర్భాలూ వున్నాయి. అందుకే.. అప్పట్లో క్రియేచర్ 3డి అనే సినిమాలో నటించింది. అలాగే మరో రెండు సినిమాలతో ఈ అమ్మడు చాలా బిజీగా వుంది. అందులో ఈ భామను గతంలోలాగా కాకుండా సరికొత్త అవతారంలో చూడవచ్చునని యూనిట్ వర్గాల సమాచారం!

ఇదిలావుండగా.. ఈ అమ్మడు చేతిలో రెండు సినిమాలు వుండగానే మూడో చిత్రానికి డేట్స్ ఇచ్చేసిందని బాలీవుడ్ సమాచారం! 25 ఏళ్లుగా మోడల్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ గా చక్కని గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ ఫడ్నీస్ ఇఫ్పుడు దర్శకుడిగా మారబోతున్నాడు. గతమూడేళ్ల నుంచి తయారుచేసిన కథకు తాను బిపాషాను ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో బిపాషా గ్లామర్ డాల్ గా కనిపించదు... ఒక మోడ్రన్ మదర్ గా కనిపించనుందని సమాచారం! ఒక సెలబ్రిటీ లైఫ్, ఫ్యామిలీ జర్ని నేపథ్యంలో కథాంశాన్ని దర్శకుడు తీర్చిదిద్దాడట! దర్శకుడు బిపాషాకు కథ వినిపించగానే ఆమె అంగీకరించిందని.. కాల్సీట్లు సర్దుబాటు చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే.. 2015లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles