Kajal cant live withouth ours of sleep

kajal aggarwal latest news, kajal aggarwal next movie, kajal movie with ntr, kajal bollywood movies, tollywood latest news, heroines silly habits funny interests, ntr next movie, ntr puri jagannath movie, sleeping good or bad for health

kajal cant live without hours of sleep : tollywood star actress kajal aggarwal have a habit of sleeping for hours per daily even any chance of gap in shooting spot immediately wents to sleep. kajal now doing movie with ntr

పడుకోకుంటే నాకు పని జరగదు

Posted: 10/31/2014 11:23 AM IST
Kajal cant live withouth ours of sleep

ప్రతి ఒక్కరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొన్ని అందరికి కామన్ గా ఉంటే.. మరికొన్ని కొంతమందిలోనే ప్రత్యేకంగా ఉంటాయి. ఉదాహరణకు యోగా చేయటం, తినటం, డైటింగ్ చేయటం, స్నానం చేయకుండా తినటం ఇలా కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు కొందరు వ్యక్తులకు ఉంటాయి. ఇవి చేయకుండా వారు ఉండలేరు. ఇది సినిమా స్టార్లలో అయినా., ఫ్యాన్స్ లో అయినా సహజం. ఆ కోవలోనే కాజల్ అగర్వాల్ కూడా తాను ఏం చేయకుండా ఉండలేనో చెప్పేసింది. ఈ ముద్దుగుమ్మ నిద్రపోకుండా అస్సలు ఉండలేదట. రోజుకు ఎనమిది గంటలు నిద్ర పోవాల్సిందే అని తెగేసి చెప్తోంది. అలా అని అక్కడికే పరిమితం అయితే బాగుండేది. కానీ షూటింగ్ స్పాట్, ప్రయాణం ఇలా ఎక్కడ కాస్త ఖాళీ సమయం దొరికినా ఓ

కునుకు తీస్తుందట. బహుశా ఆకలి రుచి ఎరగదు... నిద్ర చోటు ఎరగదు అంటే ఇదేనేమో. పడుకోకుండా మాత్రం అస్సలు పనిజరగదు బాబోయ్ అని నవ్వుతూ చెప్తోంది. ఇక తిండి విషయం ప్రస్తావిస్తే... మా సినిమా స్టార్లు ఎంత సంపాదిస్తే ఏం లాభం, అన్నీ తినలేము అని నిట్టూరుస్తోంది. లోపల తినాలని ఉన్నా.., ఏం చేస్తాం తప్పదు కదా ఆ మాత్రం పాటించకపోతే గ్లామర్ ఎలా అని సర్ధిచెప్పుకుంటుందట. ప్రస్తుతం

ఎన్టీఆర్ - పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఈ అమ్మడు నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా సినిమాలు తీస్తోంది. దీనికి తోడు తమిళ సినిమా ఆఫర్లు కూడా చేతిలో ఉంచుకుని బాగానే సంపాదిస్తోంది. అందుకే ఇంత సుఖంగా ఎప్పుడుపడితే అప్పుడు నిద్ర పోతోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal  sleep  tollywood  latest news  

Other Articles