Aamir khan speaks about his role in pk movie

aamir khan, pk movie, pk movie teaser, pk movie trailer, aamir khan interveiw, satyameva jayate show, mumkin hai show, aamir khan satyameva jayate show, anushka sharma news

aamir khan speaks about his role in pk movie

‘‘పీకే’’ చిత్రంలో అమీర్ పాత్ర అమోఘం!

Posted: 10/27/2014 04:19 PM IST
Aamir khan speaks about his role in pk movie

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న ‘‘పీకే’’ మూవీ ఇంకా విడుదలకాకముందే ఎంతటి సంచలనాలను సృష్టిస్తుందో తెలిసిందే! అందులో ముఖ్యంగా అమీర్ న్యూడ్ పోస్టర్ వివాదం అయితే ఏకంగా కోర్టుదాకా కూడా వెళ్లింది. దానిపై కోర్టు ఎలా స్పందించిందో తెలియదు కానీ.. ఈ మూవీకి రావాల్సిన పబ్లిసిటీ మాత్రం ఇప్పటికే ఫుల్లుగా వచ్చేసింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇంకా చిత్రంలో ఆమీర్ పాత్రగానీ, కథగానీ, ఇతరత్ర వివరాలుగానీ బయటకు రివీల్ కానివ్వకుండా జనాలను సస్సెన్స్ లో ముంచెత్తుతున్నారు. గతంలో ‘‘ధూమ్-3’’ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు అందులో అమీర్ ద్విపాత్రల్లో నటించనున్నాడనే విషయం బయటకు లీక్ కానివ్వకుండా ఎంత జాగ్రత్తలు పాటించారో.. ‘‘పీకే’’ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందుకే.. ఈ సినిమా విడుదలకోసం జనాలు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్రం టీజర్ కూడా విడుదలైంది. విడుదలైన కొద్దిగంటల్లోనే ఓ రేంజిలో హిట్లను కొల్లగొట్టేసింది. అయితే అందులో కూడా కథ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు దర్శకనిర్మాతలు! అయితే అందులో అమీర్ పాత్ర గత చిత్రాలకంటే ఎంతో అనూహ్యంగా వుంది. విభిన్నమైన వేషధారణలో అమీర్ అందులో కనిపించాడు కానీ.. అతని పర్ ఫెక్ట్ క్యారెక్టర్ ఏంటో తెలియరాలేదు. ఇదిలావుండగా.. ఈ సినిమాకు సంబంధించిన విశేషాల గురించి అమీర్ ఖాన్ ను అడుగితే.. తనకు తన చిత్రవిశేషాల గురించి ఇతరులతో షేర్ చేయడం ఇష్టంలేదని చెప్పేశాడు. తన సినిమా రిలీజ్ అయ్యేంతవరకు సస్సెన్స్ గానే వుంచాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక అందులో అతని పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘‘తన 25 కెరీర్ లోనే ఈ చిత్రంలో నటించిన పాత్ర చాలా బెస్ట్’’ అని మాత్రమే చెప్పుకొచ్చాడుగానీ.. ఇతర వ్యవహారాలు మాత్రం వెల్లడించలేదు.

అలాగే అమీర్ ఈ చిత్రం దర్శకుడు రాజ్ హిరానీ గురించి మాట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో రాజు చాలా బెస్ట్ డైరెక్టర్ తోపాటు మంచి మనసున్నవాడు కూడా!’’ అంటూ తెలిపాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అమీర్ తెలిపాడు. ఈ సినిమాలో అమీర్ తోపాటు అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సంజయ్ దత్ లు నటిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  pk movie  director raj hirani  anuhska sharma  satyameva jayate  

Other Articles