Pawan kalyan to direct his own movie gabbar singh 2

pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan gabbar singh 2 movie, pawan kalyan gabbar singh 2 movie shooting, pawan kalyan director, pawan kalyan latest movies, director sampath nandi, raviteja, hero raviteja movie news

pawan kalyan to direct his own movie gabbar singh 2 because sampath nandi has shifted to another movie for wasting his time from 2 years

పవన్ కల్యాణ్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాడట!

Posted: 10/25/2014 05:31 PM IST
Pawan kalyan to direct his own movie gabbar singh 2

‘‘గోపాల గోపాల’’ చిత్రం షూటింగ్ లో ఫుల్ బిజీగా వున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన తదుపరి ప్రాజెక్ట్ అయిన ‘‘గబ్బర్ సింగ్ 2’’ సినిమాపై ఇంతవరకు దృష్టిని సారించలేదు. నిజానికి ఈ మూవీ షూటింగ్ రెండేళ్ల క్రితమే మొదలవ్వాల్సి వుంది కానీ అప్పట్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ పార్టీ పెట్టడం, తర్వాత బీజేపీ-టీడీపీ తరఫు మద్దతుగా ప్రచారాలు చేయడం.. లాంటివితోనే సమయం గడిచిపోయింది. ఇక అంతలోనే ‘‘గోపాల గోపాల’’ ప్రాజెక్ట్ రావడంతో ఆ సినిమాను ఓకే చెప్పేసి తన ప్రాజెక్టును పక్కనపెట్టేశాడు. దీంతో ఈ సినిమా అప్పటి నుంచి వాయిదా పడుతూనే వస్తోంది.

‘‘గబ్బర్ సింగ’’'కు సీక్వెల్ అయిన ఈ మూవీకోసం మొదటినుంచీ దర్శకుడిగా సంపత్ నంది వర్క్ చేస్తూనే వచ్చాడు. అయితే దాదాపు రెండేళ్లు గడిచినా ఇంకా ఆ ప్రాజెక్ట్ షూటింగ్ వరకు వెళ్లకపోవడంతో తన విలువైన సమయం వృథా అయిందని అతను తప్పుకున్నట్టు సమాచారం! ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సంపత్ నంది హీరో రవితేజతో కలిసి ఓ కొత్త స్ర్కిప్టుతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ‘‘గబ్బర్ సింగ్ 2’’ సినిమా ఎప్పుడూ సెట్స్ పైకి వెళుతుందో తెలియని నేపథ్యంలోనే సంపత్ నంది ఇలా నిర్ణయం తీసుకున్నాడని అతని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.

ఇలా సంపత్ నంది వెళ్లిపోవడం వల్ల పవన్ తన ‘‘గబ్బర్ సింగ్ 2’’ సినిమా దర్శకత్వ బాధ్యతలు తన భుజాలపైనే వేసుకున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. ‘‘ఈ సినిమాకోసం సంపత్ నంది చాలాకాలం వరకు ఎదురుచూశాడు. కానీ ఎంతకీ షూటింగ్ ప్రారంభంకాకపోవడంతో నెక్ట్స్ మూవీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు. అందువల్లే స్వయంగా తానే సినిమాను తెరకెక్కించాలని పవన్ భావిస్తున్నారు’’ అంటూ చిత్ర యూనిట్ సంబంధించిన ఒకరు తెలిపారు. అంతేకాదు.. ఈ చిత్రానికి పవన్ సహనిర్మాతగా కూడా వ్యవహరించనున్నాడు. మరి.. తన స్వీయదర్శకత్వంలో పనవ్ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తాడోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles