Actress tapsee pannu revealed the secret her success in film industry

tapsee pannu latest news, tapsee pannu hot photo shoot, tapsee pannu latest photo stills, tapsee pannu hot photo shoot, tapsee pannu magazines photo shoot, tapsee pannu wiki, tapsee pannu biography, tapsee pannu movie list

actress tapsee pannu revealed the secret her success in film industry where she is getting regular movie offers

తాప్సీ సక్సెస్ వెనుక ఎవరున్నారో తెలుసా..?

Posted: 10/25/2014 11:26 AM IST
Actress tapsee pannu revealed the secret her success in film industry

‘‘ఝుమ్మందినాదం’’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ డాల్ తాప్సీ పన్ను.. ఆ మూవీ అంతగా విజయం సాధించకపోయినా అందులో ఈమె యాక్టింగ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆమెకు ఒకదాని తర్వాత ఇంకొకటి వరుసగా ఆఫర్లు వచ్చేశాయి. అయితే ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడినా... ఈమెకు ఆఫర్లు మాత్రం తగ్గనేలేదు. సాధారణంగా టాలీవుడ్ లో ఒకటికి రెండు చిత్రాలు ఫ్లాప్ అయితే అందులో నటించిన హీరోయిన్లకు ఐరెన్ లెగ్ అని పేరు వస్తుంది. దాంతో వారికి ఆ తర్వాత మూవీ ఆఫర్లు ఎంతోప్రయత్నిస్తేగానీ ఎప్పుడో అరకొర వస్తాయి. కానీ తాప్సీ విషయంలో అలా జరగలేదు. ఈమె నటించిన సినిమాలు వరుసగా పరాజయమయినా.. ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు ఈమె గుమ్మం ముందు వచ్చి నిలబడేవి. అయితే మరి ఇలా వరుసగా ఆఫర్లు రావడానికి కారణం ఎవరో తెలుసా..?

అన్ని రంగాలలోలాగే చిత్రపరిశ్రమలో కూడా హీరోయిన్ల మధ్య భారీగానే పోటీ పెరిగిపోయింది. అందుకే.. అగ్రతారలు సైతం ఎన్నడూలేని విధంగా అందాల ఆరబోతకు సిద్ధమయ్యారు. ఒక సినిమాలో ఒక హీరోయిన్ బికినీ వేసిందంటే.. మరో సినిమాలో ఇంకొక హీరోయిన్ అందుకు రెండింతలు ఎక్స్ పోజింగ్ కు తెగబడిపోతోంది. పైగా వారి సినిమాలు సక్సెస్ అయితేనే వారి అగ్రస్థానాలు అలాగే వుంటాయి. ఒకవేళ అలాకాకపోతే.. ఎంత ఎక్స్ పోజింగ్ ఇచ్చినా ఒక్కసారిగా సాధించిన స్టార్ ఇమేజ్ మొత్తం ఢమాల్ మని పడిపోవాల్సిందే! కానీ తాప్సీ విషయంలో అలా జరగకపోవడానికి కారణాలేముంటాయని అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ అమ్మడు తన విజయం వెనుకున్న రహస్యాన్ని బయటపెట్టేసింది. ఆమె ఇచ్చిన సమాధానాన్ని విన్న అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

‘‘ప్రస్తుతం చిత్రపరిశ్రమలో పోటీ బాగానే పెరిగిపోయింది.. అయినా మీరు దూసుకొచ్చేశారు.. ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగలిగారు.. ఇదెలా సాధ్యం..?’’ అని ఆమెను అగిడితే అందుకు బదులుగా తాప్సీ సమాధానమిస్తూ.. ‘‘పోటీ గురించి ఆలోచించి వుంటే నేనింత దూరం వచ్చేదాన్ని కాదేమో! తెరపై రాణించాలన్న సంకల్పమే నా మనసులో బలపడిపోయింది. ప్రేక్షకులను ఏమేర వినోదాన్ని పంచుతున్నానన్న ధ్యాసే తప్ప.. నాకు పోటీ ఎవరు? నేను ఎవరికి పోటీనివ్వాలి? అని ఆలోచించను’’ అని తెలిపింది. ‘‘నా దృష్టిలో పోటీ అనేది సమస్య కాదు.. నిజానికి మిగతా రంగాలతో పోలిస్తే సినిమాల్లోనే పోటీ తక్కువ’’ అని అంటోంది తాప్సీ! మొత్తానికి ఆమె చెప్పుకోదలచినదేమిటంటే.. తన సక్సెస్ వెనుక తన నమ్మకం, ప్రేక్షకులేనని వెల్లడిస్తోంది ఈ బికినీ భామ! ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో అక్షయ్ సరసన ‘‘బేబీ’’ సినిమాలో నటిస్తోంది. అలాగే ఆమె నటించిన ‘‘ముని-3, వాయ్ రాజా వాయ్, రన్నింగ్ షాదీ డాట్ కామ్’’ రిలీజ్ కు సిద్ధంగా వున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tapsee pannu  akshay kumar  bollywood baby movie  actresses interview  telugu news  

Other Articles