Ramcharan inspired tollywood to help hudhud victims

ramcharan teja, ramcharan teja wii, ramcharan teja movies, ramcharan teja upcoming movies, ramcharan teja latest updates, ramcharan teja on hudhud victims, ramcharan teja help to hudhud cyclone victims, ramcharan teja donation to cyclone victims, ramcharan teja marriage, ramcharan teja wife, ramcharan teja son, ramcharan teja family, ramcharan teja photos, ramcharan teja upasana photos, hudhud, hudhud cyclone, hudhud cyclone updates, hudhud cyclone latest updates, hudhud cyclone victims, hudhuc cyclone effect

mega power star ram charan tej inspired all tollywood stars to move towards helping cyclone victims : first ram charan announced rs15 lakhs for cyclone victims than other stars also responded by fallowing him

విపత్తుపై ముందుకు కదిలాడు.. అందరికి ఆదర్శంగా నిలిచాడు

Posted: 10/14/2014 06:37 PM IST
Ramcharan inspired tollywood to help hudhud victims

ఆంద్రప్రదేశ్ రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుఫానుపై టాలీవుడ్ నటులు దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి చేసిన దాడిలో బాధితులకు అండగా నిలిచేందుకు తమవంతుగా సాయం చేస్తున్నారు. వీరిలో ముందుగా విరాళాలు ప్రకటించింది రామ్ చరణ్ అని చెప్పాలి. మంగళవారం చరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రూ.10లక్షలను తుఫాను బాధితుల కోసం విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా రామకృష్ణ మిషన్ కు మరో రూ.5లక్షల రూపాయలు ప్రకటించారు. తుఫాను పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన రామ్ చరణ్.., బాధితుల పక్షాన నిలిచేందుకు అంతా ముందుకు రావాలని కోరారు.

కేవలం డబ్బులను విరాళంగా ప్రకటించటమే కాకుండా.., బాధితులకు తక్షణం సాయం అందించేందకు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో పులిహోరను తయారు చేయించి బాధిత ప్రాంతాలకు పంపించారు. అటు అపోలో సంస్థ నుంచి ప్యాకేజ్డ్ ఆహార పధార్ధాలతో పాటు., మందులను కూడా అందుబాటులో ఉంచేలా మాట్లాడి ఏర్పాట్లు చేశారు. ఈ విషయపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రామ్ చరణ్ బాధితులకు సాయం చేసేందుకు తనవంతుగా చేయి అందిస్తున్నాను అని ప్రకటించారు. తనతో పాటు మెగా ఫ్యామిలిలోని ప్రతి ఒక్కరూ తుఫాను బాధితులకు తమవంతుగా విరాళాలు ప్రకటిస్తారు అని చెప్పారు. ఈ ప్రకటన మేరకు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ విరాళాలు ప్రకటించారు.

అటు మీడియా సమావేశం సందర్బంగా చరణ్ రాజకీయ అంశాల జోలికి పోకుండా.., ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. తుఫాను సహాయక చర్యల విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పనితీరు హర్షనీయమన్నారు. తన తండ్రి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ.., వాటిని పక్కనబెట్టి ఇలా మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక ఇదే సమయంలో తుఫాను బాధితులకు మరింత అండగా నిలిచేందుకు ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాను దత్తత తీసుకునేందుకు కూడా తమ కుటుంబం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

చరణ్ ప్రకటన తర్వాత మిగతా హీరోలు కూడా స్పందించారు. ప్రతి ఒక్కరూ తమవంతుగా సాయం చేస్తన్నట్లు చెప్పారు. తుఫాను బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలా తెలుగు సినిమా పరిశ్రమ.., హుద్ హుద్ బాధితుల పక్షాన నిలిచేలా అందరికి ఇన్ స్పైర్ అయ్యాడు అని టాలీవుడ్ ప్రముఖులు చరణ్ ను మెచ్చుకుంటున్నారు. ప్రార్దించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా మాటలు చెప్పే కంటే పదిమందికి సాయం చేయటం నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramcharan teja  hudhud cyclone  telugu heros  latest updates  

Other Articles