Anchor anasuya fails to impress music directors in singing segment

anchor anasuya, anasuya latest news, anasuya singing songs, anasuya dancing, anchor anasuya news, anasuya hot photo shoot, anasuya hot photos, anchor anasuya press meet, anchor anasuya shows

anchor anasuya fails to impress music directors anup rubens, raghu kanche and devisri prasad in singing segment

డైరెక్టర్స్‌ని తృప్తిపరచలేక.. ఛాన్స్ కోల్పోయిన ఆంటీ!

Posted: 10/03/2014 04:35 PM IST
Anchor anasuya fails to impress music directors in singing segment

చిత్రపరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకోవాలంటే కేవలం అందం ఒక్కటే సరిపోదు.. దాంతోపాటు ప్రతిభను కూడా బాగా కనబరచాల్సి వుంటుంది. అప్పుడే ఎవరికైనా వరుసగా అవకాశాలు వరిస్తాయి. ఈ సూత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తారలు కూడా అంగీకరిస్తారు. కానీ.. ఈ విషయంలో యాంకర్ అనసూయ కాస్త తొందరపడ్డట్టు కనిపిస్తోంది. ఓవైపు యాంకర్‌గా బుల్లితెరమీద ఓ వెలుగు వెలుగుతున్నప్పటికీ.. సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువగా వుండటంతో ఆవైపుగా దృష్టి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే! అందుకు ఈ అమ్మడు పరిశ్రమలో చాలానే చక్కర్లు కొట్టింది కానీ.. దొరకలేదు! అయితే ఇలా కుదరక వేరే మార్గంలో అడుగులు వేద్దామని అనుకున్న ఈ హాట్ యాంకరమ్మ.. సదరు డైరెక్టర్లను తృప్తిపరచలేక ఛాన్స్ కోల్పోయిందని చిత్రవర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అసలు జరిగిన విషయం ఏమిటంటే.. ఏ విధంగా అయితే అనసూయకు సినిమాల్లో నటించాలనే పిచ్చి ఎక్కువగా వుందో.. అదేవిధంగా పాటలు పాడటమంటే కూడా చాలా ఇష్టమట! ఈమె కేవలం నటిగానే కాకుండా.. సింగర్‌గా పేరు తెచ్చుకోవాలని తెగ ఆశతో వుందని సమాచారం! దానికోసం కూడా ఈ అమ్మడు ఇప్పటికే చాలా ప్రయత్నాలు కూడా చేసేసిందని ఫిలింనగర్ నుంచి వార్తలు వస్తున్నాయి. అంతెందుకు.. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ నిర్వహించిన లైవ్ కన్సర్ట్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన అనసూయ.. అక్కడ సింగర్‌గా వెలిగేందుకు చాలా ట్రై చేసిందట! దేవీశ్రీతో మంచి సింగర్ అని అనిపించుకోవడం కోసం ఎన్నో ప్రయత్రాలు కూడా చేసిందని టాక్! కానీ.. డీఎస్పీ మాత్రం ఆమెలో వున్న ఆ కోరికను మాత్రం గుర్తించలేకపోయాడట! ఇదే విషయమై ఫిలింనగర్ సర్కిల్స్ కూడా చర్చించుకుంటున్నాయి.

ఇదిలావుండగా.. గతంలో అనసూయకు పాటలు పాడాలనే ఆసక్తి ఎక్కువగా వుందని తెలుసుకున్న ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్ రూబెన్స్, రఘు కుంచె వంటివాళ్లు ఆమెతో పాట పాడించాలని అనుకున్నారట! అయితే అంతకుముందు ఆమె చేత ఆడిషన్ చేయించుకున్నారట. ఆ ఆడిషన్‌లో రిజల్ట్ ఏమొచ్చిందో ఏమో తెలీదుగానీ.. ఆ ఇద్దరు ఆమెకు పాట పాడే అవకాశం మాత్రం ఇవ్వలేదని చిత్రవర్గాలు తెలుపుతున్నాయి. అటు సినిమాల్లో ఛాన్సులు రాక, ఇటు పాటలు పాడే ఛాన్స్ రాకపోవడంతో ఈ అమ్మడు తెగ ఫీల్ అయిపోతోందంటూ సన్నిహితవర్గాలు అంటున్నాయి. కానీ.. ఏదో ఒకరోజు తాను ఈ రెండురంగాల్లోనూ ఖచ్చితంగా పాలుపంచుకుంటాననే ధీమాలో అనసూయ వుందని ఆ వర్గాలు తెలుపుతున్నాయి. మరి ఈ అమ్మడు అనుకున్న లక్ష్యాన్ని ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anchor anasuya  tollywood news  telugu tv anchors  tollywood celebrities  

Other Articles