Pawan kalyan mahesh babu fans getting tension with kiraak movie

pawan kalyan, mahesh babu, pawan kalyan movies, mahesh babu movie, kiraak movie, kiraak telugu movie, pawan kalyan mahesh babu, mahesh pawan kalyan, kiraak movie heroine

pawan kalyan mahesh babu fans getting tension with kiraak movie

పవన్, మహేష్ రెక్కలను ‘‘ఊ’’కొడుతున్న ‘‘కిరాక్’’!

Posted: 09/05/2014 12:51 PM IST
Pawan kalyan mahesh babu fans getting tension with kiraak movie

(Image source from: pawan kalyan mahesh babu fans getting tension with kiraak movie)

ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోలు ఎవరంటే ముందుగా పవన్, మహేష్ పేర్లు వస్తాయి. అయితే వీరిద్దరిలో నెంబర్ వన్ అని ఎవరనే విషయం మాత్రం ఇంతవరకు క్లారిటీ కాలేదు. పవన్ తన సినిమాతో టాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టి ముందు స్థానంలో వుంటే... గతంలో ‘‘పోకిరి’’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ కు ఇంతవరకు ఆ క్రేజ్ తగ్గలేదు. టాలీవుడ్ లో చాలామంది టాప్ హీరోలు వున్నప్పటికీ... వీరిద్దరికి సంబంధించిన సినిమాల మధ్య వున్నంత పోటీ మరెవ్వరికీ వుండదు. ఒకరు ట్రెండ్ సెట్ చేస్తే.. మరొకరు ఆ ట్రెండ్ రికార్డును బద్దలు కొడతాడు... ఒకరు ప్రయోగాత్మక సినిమాలు చేస్తే.. మరొకరు ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ బాగానే నవ్వులు పండిస్తారు. ఇలా ఒకర్నొకరు పోటీ ఇచ్చుకుంటూ దూసుకుపోతున్నారు కానీ.. వెనక్కు మాత్రం తగ్గడం లేదు. దీంతో వీరిద్దరి మధ్య నెంబర్ వన్ స్థానం ఎవరనే విషయం మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు.

ఇదిలావుండగా.. ఈ ఇద్దరు హీరోలకు టాలీవుడ్ లో ఏ రేంజిలో క్రేజుందో అందరికీ తెలిసిందే! అందుకు ఉదాహరణగా... గతంలో ఈ ఇద్దరి హీరోల ఇమేజ్ ను వాడుకుని ఎన్నో సినిమాలు హిట్ సాధించాయి. ఇప్పటికీ అటువంటి సినిమాలు వస్తూనే వున్నాయి. చిన్న సినిమాల్లో ఈ ఇద్దరి హీరోల ప్రస్తావన ఈమధ్యకాలంలో మరింతగా ఎక్కువగా పెరిగిపోతోంది. అందులో భాగంగానే తాజాగా ‘‘కిరాక్’’ అనే మూవీ కూడా వస్తోంది. అందులో పవన్, మహేష్ ల మాస్క్ లు వేసుకుని వున్న ఒక వీడియోను ఈ సినిమా పబ్లిసిటీకి ఓపెన్ గా వాడేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తమ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ విజయబాటవైపు నడిపి, భారీ కలెక్షన్లను రాబట్టుకోవాలనే నేపథ్యంలో ఈ ఇద్దరి బడాహీరోల ఇమేజ్ ను తెగ వాడేసుకుంటున్నారు.

ఈ ఆలోచన బాగానే వుంది కానీ.. ఒకవేళ కిరాక్ సినిమా భారీగా ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం పెద్ద ప్రమాదమే వచ్చిపడుతుంది. ఎందుకంటే.. సినిమా ప్రమోషన్ల భాగంగా పవన్, మహేష్ ల ఇమేజ్ అను బాగానే వాడుకుంటున్న నేపథ్యంలో ఈ మూవీ ఫ్లాప్ అయితే వారిద్దరి ఇమేజ్ పై అది ప్రభావం చూపుతుందని ఆ బడాహీరోల అభిమానులు భయపడుతున్నట్టు సమాచారం! ఆ సినిమాలో పవన్ ‘‘అత్తారింటికి దారేది’’ మూవీలోని ఒక డైలాగ్ ను మక్కీకి మక్కీగా ఒక కొత్త హీరోతో చెప్పించడం మరి అతిగా వుందని పవన్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే మహేష్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వుండటంతో ఆ హీరో అభిమానులు కూడా గగ్గోలు పెడుతున్నట్టు తెలుస్తోంది. వాడుకున్నంతవరకు బాగానే వుందికానీ.. ఆ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా కిరాక్ సినిమా స్టోరీలోకి వెళితే.. అందులోని హీరోయిన్ మహేష్ కు వీరాభిమాని.. అలాగే హీరో పవన్ కల్యాణ్ కు అభిమాని. అనుకోకుండా వీరిద్దరూ కలుసుకుంటారు.. ఆ స్నేహబంధం ప్రేమగా చిగురిస్తుంది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. వీరిద్దరూ వేర్వేరు హీరోల అభిమానులు కావడంతో అందుకు వీరిమధ్య కొన్ని గొడవలు జరుగుతాయి. మరి వీరిద్దరూ చివరికి కాంప్రమైజ్ అవుతారా..? మహేష్, పవన్ లకు సంబంధించి డైలాగులు ఎలా రాశారు..? వారిద్దరి గురించి ఇందులో ఏముందోనన్న విషయాల మీద ఆ బడాహీరోల ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారని వార్తాసారాంశం! మరి పవన్, మహేష్ లాంటి హీరోలను బాగానే వాడుకున్న కిరాక్.. హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  mahesh babu  kiraak movie  tollywood  telugu movies  

Other Articles