Queen movie remake in telugu version

charmi lead role in hindi remake queen movie in telugu version, actress charmi latest news, actress charmi in hindu remake queen movie, raani movie news, actress charmi in raani movie, actress charmi kaur hot photoshoot, charmi kaur hot photo shoot, charmi kaur in hindu remake queen movie, charmi kaur in queen movie remake, charmi kaur in raani movie

Actress charmi lead role in hindi remake queen movie in telugu version

‘‘రాణి’’ కిరీటాన్ని దొబ్బేసిన ఛార్మి!

Posted: 07/22/2014 12:54 PM IST
Queen movie remake in telugu version

టాలీవుడ్ బొద్దుగుమ్మ ఛార్మికి ఇన్నాళ్లవరకూ సినిమా ఆఫర్లు లేక కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే! ఆఫర్లకోసం ఎన్నోరకాల హాట్ ఫోటోషూట్ లు, పార్టీలు - పబ్ లలో డ్యాన్సులు చేసుకుంటూ ఇన్నాళ్లవరకు కాలాన్ని వెళ్లదీసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా... దర్శకనిర్మాతలు మాత్రం ఈమెవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కానీ హఠాత్తుగా రాణి కిరీటాన్ని దొబ్బేసిన ఛార్మి అంటూ వార్తలు పుకార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై తీరా ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది.

బాలీవుడ్ లో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ‘‘క్వీన్’’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! ఈ సినిమాలో కంగనా నటించిన తీరు ఎంతో అద్భుతంగా వుందంటూ కేవలం దర్శకుడే కాదు... ప్రేక్షకాభిమానులు కూడా కితాబిచ్చారు. ఆమె కెరీర్ లో ఇంతవరకు తీసిన సినిమాలన్నింటిలో కంటే ఈ చిత్రం ఎంతో బాగుందంటూ అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కంగనా బాలీవుడ్ ‘‘క్వీన్’’గా పేరు సంపాదించుకుంది.

అంతటి భారీ రేంజిలో హిట్టయిన కథను కూడా మన తెలుగు, తమిళ ప్రేక్షకులను పరిచయం చేయాలని సౌత్ ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు భావించారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా రీమేక్ హక్కుల్ని త్యాగరాజన్ ఎప్పుడో విక్రయించేశారా కూడా! కానీ ఇందులో కథానాయికను ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే డైలామాలోనే మునిగిపోయారు. తొలుత ఈ సినిమాలో క్వీన్ త్రిష నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత వరుసగా సమంత, శ్రీయ, నయనతార వంటి తారలు నటించనున్నారని వార్తలు కథనాలుగా వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం... నిర్మాత ఆ హీరోయిన్లందరినీ కాదనుకుని తన క్వీన్ సినిమాల్లో లీడ్ రోల్ గా నటించాలంటూ ఛార్మిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ వీరి మధ్య ఈ సినిమా విశేషాలకు సంబంధించి చర్చలు సాగుతున్నాయని వార్తలు వెల్లువడుతున్నాయి. ఈ కథలో కొంతవరకు మార్పులు చేరిస్తే బాగుంటుందనే నేపథ్యంలో చర్చలు కొనసాగిస్తున్నట్టు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. తెలుగులో ఈ సినిమాకు ‘‘రాణి’’ అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు తెలుపుతున్నారు.

ఒకవేళ ఛార్మి ఈ సినిమాలో నటించనున్నట్లయితే... ఆమె రాణిగా పూర్తి న్యాయం చేస్తుందంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ‘‘మంత్ర’’ సినిమాలో ఛార్మి తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని, అందుకే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెబుతున్నారు. పైగా ఛార్మి దక్షిణాదిన వున్న అభిమానులందరికీ సుపరిచితమే కావడంతో... కలెక్షన్లు కూడా బాగానే వస్తాయని ప్రతిఒక్కరు చర్చించుకుంటున్నారు. చివరకు ఛార్మి ఇన్నాళ్లూ చేసిన నిరీక్షణకు మంచి ఫలితమే దక్కించుకుందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles