Tamil actor kadal dandapani died

Tamil actor kadal dandapani died, kadal dandapani died with heart attack on sunday, tamil actor kadal dandapani, tamil actor dandapani news, tamil actor dandapani died with heart attack, dandapani died with heart attack, dandapani in krishna movie, villain dandapani in premisthe movie, villain dandapani villain characters in movies, tamil actor dandapani filmography

kadal dandapani died with heart attack on sunday

కాదల్ దండపాణి ఇకలేరు!

Posted: 07/21/2014 10:29 AM IST
Tamil actor kadal dandapani died

విలన్ గా తనదైన నటన శైలితో అందరినీ మెప్పించిన తమిళ నటుడు దండపాణిగారు ఆదివారంనాడు కన్నుమూశారు. ప్రస్తుతం శరత్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘‘చండమారుతం’’ సినిమాలో ఒక కీలకపాత్రను పోషిస్తున్న ఈయన... శనివారంనాడు చిత్రీకరణలో పాల్గొని తన ఇంటికి చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఈయన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం దగ్గరలోనే వున్న ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి చేయిదాటిపోవడంతో ఈయన అక్కడే తుదిశ్వాసను విడిచారు. దండపాణిగారికి 71 సంవత్సరాలు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెలు వున్నారు.

దండపాణిగారు తమిళ నటుడైనా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే! తెలుగులో ఈయన కృష్ణ, రాజుభాయ్, దిల్, ప్రేమిస్తే వంటి చిత్రాల్లో విలన్ గా తన సత్తా చాటుకున్నాడు. కోలీవుడ్ లో రిలీజైన ‘‘కాదల్’’ చిత్రంలో తన అద్భుతనటన ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతో ఈయనకు ‘‘కాదల్ దండపాణి’’ అనే పేరు స్థిరపడిపోయింది. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 150 సినిమాలకు పైగా నటించి మాస్ విలన్ గా పేరు తెచ్చుకున్న దండపాణిగారు లాంటి మనిషిని పోగొట్టుకున్నందుకు యావత్తు సౌత్ ఇండస్ట్రీ ఆయనకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles