I want a wife like alia bhatt says varun dhawan

Bollywood movie Humpty Sharma Ki Dulhania, Varun Dhawan, Ashutosh Rana, Siddharth Shukla, varun dhawan, alia bhatt, student of the year, humpty sharma ki dulhania

I want a wife like Alia Bhatt says Varun Dhawan

నాకు ఆలియాభట్ లాంటి పెళ్ళాం కావాలి ??

Posted: 07/07/2014 04:21 PM IST
I want a wife like alia bhatt says varun dhawan

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన మహేశ్ భట్ కూతరు తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో ఎఫైర్ నడిపిస్తుందనే వార్తలు బాలీవుడ్ లో చెక్కర్లు కొడుతున్నాయి.

ఈ విషయం పై సదరు హీరోగారిని అడిగితే కాస్తంత వంకర టింకరగా సమాధానం చెప్పడమే కాకుండా ఆమెతో ఎఫైర్ ఉందని చెప్పకనే చెప్పాడు. మీరు ఆలియా పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారట కదా అని అడిగితే... ‘‘అవునా.. అందుకు మరి ఆమె ఒప్పుకుందా? ప్లీజ్ ఆమె కాకపోయినా ఆమెలాంటి మంచి అమ్మాయిని కాస్త వెతికిపెట్టండి మీకు పుణ్యముంటుంది.

అని రివర్స్ పంచ్ ఇవ్వడమే కాకుండా, ‘‘హంప్టీ శర్మకీ దుల్హనియా ’’ చిత్రంలో ఆలియా భట్  క్యారెక్టర్‌ లాంటి గుణం  ఉన్న  అమ్మాయి  కావాలని చెప్పడంతో అక్కడున్న మీడియా వారు అలాంటి అమ్మాయిని మేం వెతికి పెట్టడం ఎందుకు ఆమెనే చేసుకుంటే ఓ పనైపోలా ? అని లోలోన సెటైర్లు వేశారట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles