Salman gifts watch to sidharth malhotra

salman watch gift to sidharth malhotra, sidharth-malhotra, salman-khan, ek-villain, ek villain movie success party, ek villain movie, movie news, shraddha kapoor in ek villain movie, ritesh deshmukh in ek villain movie.

Salman gifts watch to Sidharth Malhotra

గిఫ్ట్ లతో ఆశ్చర్యపరుస్తున్న సల్మాన్

Posted: 07/04/2014 10:54 AM IST
Salman gifts watch to sidharth malhotra

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో టాప్ రేసులో దూసుకుపోతూ, వరుస విజయాలు సాధిస్తే తోటి హీరోలు ఎంతో కుళ్లుకుంటారు. కానీ బాలీవుడ్ లో అలా ఉండదు. ఏ హీరో విజయం సాధించినా దాన్ని స్పోర్టీవ్ గా తీసుకుంటూ వారికి తనవంతు సహాయ సాహాకారలు అందించడమే కాకుండా, బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు. ఇలా గిఫ్ట్ లు ఇవ్వడంలో బాలీవుడ్ కండల స్టార్ సల్మాన్ ఖాన్ ముందుంటాడు.

పెద్ద స్టార్ అయిన సల్మాన్ తన దగ్గర ఉండే వాళ్ల దగ్గరి నుండి తోటి నటీ నటుల వరకు అందరికి బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంటాడు. తన ప్రేయసిరాళ్లకు ఎంతో ఖరీధైన బహుమతులు ఇచ్చే సల్మాన్ ఇటీవలే తన సినిమాలో నటిస్తున్న జాక్వెలైస్ ఫెర్నాండేజ్ కు ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చాడు. ఇది జరిగి రెండు మూడు రోజులు గడవక ముందే మరో ఖరీధైన బహుమతిని ఓ హీరోకి ఇచ్చి ఆయన విశాల హృదయాన్ని మరోసారి చాటుకున్నాడు.

‘ఏక్ విలన్ ’ సినిమా కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఆ సినిమా విజయం సాధించినందుకు తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీకి సల్మాన్ ఆహ్వానించాడు. ఈ కార్యక్రమానికి హాజరైన సల్మాన్ ఆయనకు ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇవ్వడమే కాకుండా, ఆయన నటనను మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని పలువురితో పంచుకుంటూ తెగ ఆనందపడిపోతున్న సిద్దార్థ్ సల్మాన్ లాంటి కథానాయకుడు వచ్చి గిఫ్ట్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎప్పటికీ మరచి పోలేనని చెబుతున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles