(Image source from: Shakeela reveals her live in relationship stories with heroes and directors)
టాలీవుడ్ లో కేవలం అడల్ట్ సినిమాలతో ప్రత్యేక ఇమేజీని సంపాదించుకున్న షకీలా ఆంటీ గురించి తెలియని వారు ఎవ్వరుండరు. తన అందాలతో, ఒంపుసొంపులతో ప్రేక్షకజనాలను కట్టిపడేసిన ఈ భామ... యావత్తు సౌతిండియానే ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ల కంటే షకీలాకే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ వుండేది. ఈ ఫ్యాన్స్ లిస్ట్ లో దర్శకనిర్మాతలతోపాటు చాలామంది హీరోలు కూడా వున్నారని గతంలోనే షకీలా తన రహస్యాల్ని బహిర్గతం చేసింది. మొన్నటికి మొన్న తన ఆటోబయోగ్రఫీకి సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా రాసుకుంది. అయితే అందులో తనతో సుఖం పొందిన ఆ దర్శకనిర్మాతల, హీరోల పేర్లు మాత్రం బయట పెట్టలేదు.
కొన్నాళ్లపాటు పోర్న్ సినిమాల్లో నటించిన ఈ హాట్ భామ... ఆ తరువాత రూట్ మార్చేసింది. స్టార్ హీరోల సైతం కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు కూడా చేసింది. ఇప్పుడు తాజాగా దర్శకురాలిగా అవతారమెత్తిన షకీలా... అందుకు సంబంధించి ఓ మేగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తన సినిమా విశేషాలతోపాటు గత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా చెప్పుకొచ్చింది. పోర్న్ స్టార్ సినిమా ఇండస్ట్రీలో తాను ఎంట్రీ ఇవ్వడానికి, ఎంట్రీ ఇచ్చిన తరువాత పడిన కష్టాల గురించి వివరించింది.
సినిమా ఇండస్ట్రీలో పోర్న్ స్టార్ గా నటిస్తున్న రోజుల్లో ఈమె వెంట చాలామంది తన వెంటపడ్డారని చెప్పుకొచ్చింది. అందులో ముఖ్యంగా కొంతమంది హీరోలు, ప్రముఖులు కూడా వుననారని చెప్పింది. ఈ క్రమంలోనే ఈమెతో ఒక హీరో చాలా సాన్నిహిత్యంగా వుండేవాడని... ఎప్పుడూ తన వెంటే పడేవాడని అంది. అతని గురించి మరికొన్ని విశేషాలు చెబుతూ... ‘‘ఆ హీరోతో నేను దాదాపు 5 సంవత్సరాల వరకు సహజీవం చేశాను. మొదట అతని ప్రవర్తన బాగానే వుండేది. అయితే తరువాత ఒక అపరిచితుడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నన్ను విపరీతంగా కొట్టడమే కాకుండా.. తనని తాను కూడా గాయపరుచుకునేవాడు. కొద్దిసేపు చల్లబడిన తరువాత చివరికి క్షమించమని వేడుకునేవాడు’’ అని తన గత అనుభవం గురించి చెప్పుకుంది. అయితే అతని టార్చర్ రానురాను మరీ ఎక్కువయిపోయిందని, అది తట్టుకోలేక అతనిని వదిలేశానని తెలిపింది. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి ఇష్టంలేదని స్పష్టం చేసింది.
అలాగే.. ‘‘ఇటువంటి ప్రేమ విషయాల గురించి చెప్పుకుంటూపోతే... నన్ను ప్రేమించినవాళ్లు దాదాపు 20 నుంచి 25 మందిదాకా వుంటారు. అయితే వారందరిలో నామీదున్న ప్రేమకన్నా... మరొకటి ఆశిస్తున్నట్టు కనిపించేది. నన్ను నేనుగా ప్రేమించే వ్యక్తి ఇంతవరకు నాకు దొరకలేదు’’ అని బాధను పంచుకుంది. అయితే గతంలో షకీలా వెంటపడ్డ ఆ హీరో, ఇతర వ్యక్తుల పేర్లను ఎందుకు బహిర్గతం చేయడం లేదని సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more