Auto nagar surya to be released on 27 august

auto nagar surya to be released on 27 august, auto nagar surya movie, naga chaitanya latest news, auto nagar surya movie release date, auto nagar surya movie latest news, auto nagar surya movie review, auto nagar surya movie collections

auto nagar surya to be released on 27 august

నాగ చైతన్య ఆటోకి గేర్ పడింది

Posted: 06/25/2014 11:20 AM IST
Auto nagar surya to be released on 27 august

(Image source from: auto nagar surya to be released on 27 august)

ఎప్పుడో భూమి పుట్టినప్పుడు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ‘‘ఆటోనగర్ సూర్య’’ సినిమా... కొన్ని వివదాల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. ఆ మధ్య ఆగస్టు మొదటివారంలో రిలీజ్ అవుతుందని ప్రకటించినా... ఫైనాన్షియల్ కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు యూనిట్ సభ్యులు పక్కాగా చెబుతున్నారు.

నాగ చైతన్య హీరోగా నటించిన ‘‘ఆటోనగర్ సూర్య’’ సినిమా గతేడాది నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న విషయం అందరికి తెలిసిందే! అయితే ఆ వివాదాలన్నీ సమసిపోవడంతో ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ సభ్యులు పక్కాగా ప్లాన్ చేసినట్టు సమాచారం!

గతంలో ఈ సినిమాను పరిశీలించిన సెన్సార్ బోర్డు సభ్యులు.. కొన్ని అభ్యంతరకరమైన సీన్లను కట్ చేసి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ మరోసారి పరిశీలించిన అనంతరం.. ఈసారి ఎటువంటి కట్స్ విధించకుండానే ‘‘ఏ’’ సర్టిఫికెట్ ఇచ్చారని యూనిట్ మెంబర్లు పేర్కొన్నారు. దీంతో ఈ యూనిట్ బృందం కొంత నిరాశ చెందినప్పటికీ... తరువాత అడ్జస్ట్ చేసుకున్నారని తెలిపారు. అలాగే ఈ సినిమా రన్ టైమ్ కూడా టైటిల్స్ మొదలుకుని, ఎండింగ్ వరకు మొత్తం 2 గంటల 37 నిముషాల వరకు వుంటుందని బోర్డు మెంబర్లు వెల్లడించారు.

యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో మెకానిక్ గా నటించిన నాగచైతన్యలో ఒక కొత్త మాస్ లుక్ ని చూస్తారని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. అయితే ఇంకా కొన్ని ఫైనాన్షియల్ ప్లాన్ వున్నాయని... 27వ తేదీలోపు అవన్నీ కంప్లీట్ అవుతాయని యూనిట్ మెంబర్లు పేర్కొంటున్నారు. అంటే.. ఈ సినిమా 27వ తేదీ రిలీజ్ కానుందని పక్కాగా చెప్పలేమని వారు కూడా చెప్పకనే చెప్పేస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్న నిర్మాతలకు అసలు ఊరట లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles