Anushka misses ajith film shoot

Anushka Shetty, Anushka misses Ajith film shoot, Ajith Gautham Menon movie, Telugu and tamil actress

Anushka Shetty and her professionalism after she missed the shooting of a film scene for Ajith-Gautham Menon movie.

వస్తానని చెప్పి రాలేదు.. ఫైర్ అయ్యాడు

Posted: 05/30/2014 04:10 PM IST
Anushka misses ajith film shoot

వస్తానన్న టైంకి హీరోయిన్లు రాకపోతే, ఇచ్చిన కాల్షీట్ల డేట్లను మారిస్తే దర్శక నిర్మాతలకు తెగ కోపం వస్తుంది. ఇప్పుడు అలాంటి ఆగ్రహానికే గురవుతుంది టాలీవుడ్ బొమ్మాళి అనుష్క. ఈ అమ్మడు ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులు అయిన బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో చేస్తుంది. రుద్రమదేవి షూటింగ్ సగానకి పైగా పూర్తి కావడంతో ఈ అమ్మడు తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్  సినిమాలో నటించడానికి కాల్షీట్లు ఇచ్చింది.

ఈమెను నమ్ముకొని షూటింగ్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ తీరా ఈమె రాకపోయేసరికి షూటింగ్ కేన్సిల్ చేసుకోవడం వల్ల ఆర్ధిక నష్టంతో బాటు ఇతర ఆర్టిస్టుల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయట. దాంతో, దర్శకుడు గౌతమ్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడని అంటున్నారు. మరోసారి ఇలా జరిగితే నిర్మాతల మండలికి కంప్లైంట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించాడట.

రుద్రమదేవి షూటింగులోని కొన్ని సీన్స్ అనుకున్న టైంకి కంప్లీట్ కాకపోవడంతోనే ఇలా గైర్హాజరు అయిందని ఆమె సన్నిహితులు చెబుంతే... ఇటీవలే బాహుబలి షూటింగు నుండి హాలిడేస్ తీసుకున్న అనుష్క ఇంట్లో మసాజ్ లు చేయించుకుంటూ సేద తీరుతూ హాయిగా గడిపే బదులు గౌతమ్ సినిమా షూటింగుకు హాజరు అయితే సొమ్మేం పోయిందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles