నందమూరి నట సింహం బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లెజెండ్ ’ సినిమా ఇటు సినీ వర్గాల్లో, అటు అభిమానుల్లో రోజు రోజుకు అంచనాల్ని పెంచుతుంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త టీజర్ ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ ఇప్పుడు అంతర్జాలంలో హల్ చేయడమే కాకుండా, అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
సింహా సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ తో ఫక్తు బాలయ్య సినిమాగా మలిచిన దర్శకుడు బోయపాటి.. ఇప్పుడు మరోసారి తన మార్క్ ని లెజెండ్ సినిమాలో చూపిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన లెజెండ్ ఆడియో టీజర్లో దుమ్ము లేపేశాడు. బాలయ్య మేనరిజానికి దేవిశ్రీ మ్యాజిక్ తోడై నందమూరి అభిమానులను మెస్మరైజ్ చేసింది.
హీ ఈజ్ ఏ లెజెండ్ అంటూ ఆడియో టీజర్ లో బాలయ్య లుక్ అదిరిపోతుంటే.. దీనికి తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చితక్కొట్టేశాడు. తొలిసారి బాలయ్య సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ తో దర్శక నిర్మాతలు తెగ ఆనందపడిపోవడమే కాకుండా, సినిమా హిట్టవ్వడం ఖాయం అనే ధీమాతో ఉన్నారు.
ఇక ఈ సినిమా ఆడియోను ఈనెల 7వ తేదీన హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో అంగరంగ వైభవంగా విడుదల చేయడానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. రేపు రాత్రి 7.33 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను మార్చి 28వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
Knr
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more