Balaiah legend and arjun race gurram release on the same day

balaiah, allu arjun, balakrishna, arjun, legend movie, race gurram, Balaiah legend release 28, Arjun race gurram release 28, march 28 legend release. balaiah vs bunny.

Balaiah legend and Arjun race gurram release on the same day

బాలయ్యతో కయ్యానికి కాలుదువ్వుతున్న బన్నీ?

Posted: 03/01/2014 10:19 AM IST
Balaiah legend and arjun race gurram release on the same day

టాలీవుడ్ లో సీనియర్  హీరో నందమూరి నటసింహం బాలయ్యతో..  యంగ్ స్టైలిస్  స్టార్  మెగా మెరుపు అల్లు అర్జున్ ఇద్దరు పోటీపడుతున్నారు.టాలీవుడ్ లో ఇలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు చాలా అరుదుగా జరుగుతాయి.  నువ్వా-నేనా  అనే విధంగా  ఈ ఇద్దరు పోటీపడుతున్నారు.  ఇంతకీ విషయం ఏమిటంటే.. మార్చీ  28తేదీ పై  బాలయ్య, బన్నీ ఇద్దరు పోటీపడుతున్నారు.  

తమ సినిమాలను  రిలీజ్ చేసుకునేందుకు  ఆతేదీ పై ఆధారపడినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే  బాలయ్య నటిస్తున్న 'లెజండ్' చిత్రాన్ని మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. అదే బాటలో ఈ రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న 'రేసుగుర్రం' సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చింది. మొదట్లో ఏప్రిల్ 12న అనుకున్నది కాస్తా 'లెజండ్' రిలీజ్ డేట్ నే దీనిని కూడా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే, బన్నీ ఇలా బాలయ్య మీదకు ఎందుకు పోటీగా వస్తున్నాడన్నది మాత్రం తెలియడం లేదు. 'లెజండ్' సినిమాకు హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. మరి, అలాంటి సినిమా విడుదల రోజునే తన సినిమాను కూడా రిలీజ్ చేయడానికి బన్నీ ఎందుకు సాహసిస్తున్నాడో? ఎవరికి అర్థం కావటంలేదు.  ఈ విషయం టాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles