Ram charan special song in oh my god remake

Ram Charan special song, Oh My God Remake, Kajal, Venkatesh and Pawan Kalyan, OMG, North Star Entertainment, Dolly

Ram Charan special song in Oh My God Remake. Ram Charan Special Song,Oh My God Remake, Kajal, Venkatesh and Pawan Kalyan, OMG

బాబాయి సినిమాలో చరణ్ స్పెషల్ సాంగ్

Posted: 02/22/2014 10:02 AM IST
Ram charan special song in oh my god remake

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మల్టీ స్టారర్ చిత్రాలు, గెస్ట్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడనిపిస్తుంది. ఇప్పటికే క్రిష్ణవంశీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రం  చేస్తున్న చరణ్ ఇప్పుడు వెంకీ-పవన్ కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో గెస్ట్ లో చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్ ’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

రిజినల్ సినిమాలో ‘గో గో గోవింద ’ అనే పాటలో ప్రభుదేవా, సోనాక్షి సిన్హా కలిసి ఆ పాటలో అదరగొట్టారు. ఇప్పుడు అదే పాటను తెలుగు రీమేక్ లో రామ్ చరణ్ - కాజల్ ల పై చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే ఈ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ రావడమే కాకుండా, సినిమా పై అంచనాలు మరింత పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రలో పవన్ కళ్యాటిస్తుండగా, పరేష్ రావల్ పోషించిన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి టైటిల్ గా ‘ఓరి దేవుడా ’ అని ఫిలిం చాంబర్ లో నిర్మాత సురేష్ బాబు రిజిస్టర్ చేయించినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలుగులో ఇద్దరు పెద్ద స్టార్లు, మరో యంగ్ స్టార్ హీరో నటిస్తుండటంతో అటు వెంకీ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఈ చిత్రం పై ఎంతో ఆసక్తితో ఉన్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles