Rajamouli to start vfx company soon

s.s rajamouli, new business plans, vfx graphics conpany, tollywood, VFX effects, Baahubali, Rana, Prabhas, Anushka, Tammanna.

Rajamouli is planning to launch a big VFX company and make some good business in it for future Tollywood.

విజువల్ స్టూడియో కంపెనీ పెట్టబోతున్నాడు

Posted: 02/05/2014 04:53 PM IST
Rajamouli to start vfx company soon

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి మనస్సు ఇప్పుడు బిజినెస్ పై పడిందట. త్వరలో ఆయన హైదరాబాద్ లో పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అప్పుడెప్పుడో వచ్చిన ‘యమదొంగ ’ సినిమా నుండే విజువల్ ఎఫెక్ట్స్ ను బాగా వాడుకుంటున్న ఈయన తరువాత మగధీర, మర్యాద రామన్న చిత్రాల్లో కూడా ఉపయోగించి అబ్బుర పరిచాడు.

ఇక  ఈగ వంటి చిత్రంలో తన విజువల్ ఎఫెక్ట్స్ తో తెలుగు ప్రేక్షకుల్నే కాకుండా  యావత్ ప్రపంచంలోని వివిధ భాషల వారిని ఆకట్టుకొని ప్రశంసలు అందుకొంది. ప్రస్తుతం రూపొందిస్తున్న ‘బాహుబలి ’ లో కూడా భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించబోతున్నాడు. భవిష్యత్తులో విజువల్ ఎఫెక్ట్స్ కి ఉండే ప్రాధాన్యతను గుర్తించిన ఈయన సొంతంగా ఆ కంపెనీని ప్రారంభించేందుకు పూనుకున్నాడట.

దానికి సంబంధించిన పనులు కూడా చకచకా జరుగుతున్నట్లు తెలుస్తుంది. తన సినిమాలే కాకుండా ఇతర దర్శకుల సినిమాలకు కూడా ఆ సంస్థ సేవలు అందిస్తుందని అంటున్నారు. రాజమౌళి ముందు చూపుతో ఆలోచించి చేస్తున్న ఈ బిజినెస్ మంచి సక్సెస్ అవుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles