Pawan attarintiki daredi thank you meet cancelled

Pawan Attarintiki Daredi Thank You Meet, Attarintiki Daredi Thank You Meet cancelled, CancelledTelugu Film Producers Council, Sushil Kumar Shinde, thank you meet, Attarintiki Daredi

The Thank you meet that the star had intended to organise with his co-stars as the movie had done well at the box-office has been cancelled.

పవన్ థ్యాంక్స్ చెప్పనంటున్నాడు

Posted: 10/05/2013 11:13 AM IST
Pawan attarintiki daredi thank you meet cancelled

రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చి, చివరకు పైరసీకి గురై చివరకు విడుదల అయిన పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది ’ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిరిపిస్తుండటంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ను రేపు అనగా (అక్టోబర్ 6) తేదీన శిల్పకళా వేదికలో చిన్నపాటి ఫంక్షన్ ఏర్పాటు చేసి ఈ సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపడానికి ఆ చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చి ప్రేక్షకులకు థ్యాంక్స్ కూడా చెప్పబోతున్నాడని అన్నారు. కానీ ఫిలింనగర్ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని తెలిసింది. ఎప్పుడు హంగు హార్బాటాలకు దూరంగా ఉండే పవన్, కేంద్రం తెలంగాణ ను అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో ఎగిసిపడుతున్న ఆందోళనల నేపధ్యంలో దీనిని నిర్వహించ వద్దని చెప్పడంతో నిర్మాత వెనక్కు తగ్గాడని అంటున్నారు. అయితే సీమాంధ్ర పవన్ ఫ్యాన్స్ మాత్రం సీమాంధ్రులు ఆందోళనలు చేస్తుంటే... విజయోత్సవాలు భావ్యం కాదనే పవన్ కల్యాణ్ ఈ వేడుకను వద్దన్నాడని అంటున్నారు. కారణం ఏదైనా పవన్ ఫ్యాన్స్ కి కాస్తంత నిరాశ కలిగించే విషయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles