Charan yevadu reshoot plan

Charan yevadu reshoot plan, ramcharan yevadu, yevadu reshoot, vamsi director, dilraju producer

Charan yevadu reshoot plan, ramcharan yevadu, yevadu reshoot, vamsi director, dilraju producer

‘ఎవడు ’ విషయంలో అతిజాగ్రత్త పడుతున్నాడు

Posted: 09/20/2013 10:55 AM IST
Charan yevadu reshoot plan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన స్టార్ డమ్ ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఆయన సినిమాలు ఏదైనా డిజాస్టర్ అయితే తరువాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడతాడు. ఆ మధ్య ఆరెంజ్ సినిమా డిజాస్టర్ తరువాత ‘రచ్చ’ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని విడుదల చేశాడు. ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. ఈ మధ్య నటించిన ‘తుఫాన్ ’ సినిమా అడ్రస్ లేకుండా పోవడంతో... ఇప్పటికే నటించి విడుదలకు సిద్ధం అయిన ‘ఎవడు ’ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. ఆ చిత్రం మిగిల్చిన పరాజయం ఈ సినిమా  పై పడకుండా ఈ సినిమాకు సబంధించిన కొన్ని సీన్లను మళ్ళీ రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాగూ ఉద్యమం నేపథ్యంలో రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సరిగాలేని సీన్లను తొలగించి.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే చెర్రీ ఆలోచన పై నిర్మాత దిల్ రాజు కాస్త గుర్రుగా ఉన్నాడట. ఇప్పటికే తాను నిర్మించిన సినిమాలు విడుదల కాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మళ్ళీ రీషూట్ చేయడం అవసరమా అని లోలోపల అనుకుంటున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles