Nayanthara gets a new look for anamika movie

Nayanthara gets a new look for anamika movie, Tamil version, Anamika as Nayanthara, Nayanthara, Nayanthara gets a new look for Kahaani, Nayantara Anamika First Look Photos

Nayanthara gets a new look for anamika movie, Tamil version, Anamika as Nayanthara, Nayanthara gets a new look for Kahaani

కొత్త నయనతార

Posted: 09/16/2013 11:15 AM IST
Nayanthara gets a new look for anamika movie

మహిళా ప్రాధాన్యం కలిగిన కథాంశంతో తెరకెక్కుతున్న 'అనామిక' చిత్రంలో నటించడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని కథానాయిక నయనతార అంటోంది. ఆమె ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇందులో కొత్త నయనతారను చూస్తారని, హిందీ 'కహానీ' చిత్రాన్ని యథాతథంగా కాకుండా కేవలం మూలకథను మాత్రమే తీసుకుని, అనేక మార్పులు, చేర్పులు చేసి శేఖర్‌ కమ్ముల తనదైన శైలిలో రూపొందిస్తున్నారని నయనతార చెబుతోంది. ఇక భర్తను అన్వేషిస్తూ హైదరాబాద్‌ నగరంలో ఓ యువతి చేసిన పోరాటమే ఈ చిత్రమని, అయితే ఆమె ప్రయత్నం ఫలించిందా? లేదా? అన్నది వెండితెరపై చూడాల్సిందేనని అంటున్నారు. కాగా ఓ రీమేక్‌ చిత్రాన్ని శేఖర్‌ తన దర్శకత్వంలో తియ్యడమన్నది ఇదే తొలిసారి. ఆ చిత్ర కథాంశం ఆయనను ఎంతగా స్పందింపజేసిందో దీనిని బట్టి అర్థమౌతుందని, అదీగాక నూతన తారలతో ఎక్కువగా చిత్రాలు చేసే ఆయన ఈ చిత్రం కోసం నయనతార లాంటి అగ్ర కథానాయికను తన చిత్రానికి ఎంపికచేసుకోవడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నయనతారకు తమిళంలో ఉన్న క్రేజ్‌కు అనుగుణంగా తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దసరా సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలన్న దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles