Siddharth denies love affair with samantha

Siddharth denies love affair, siddartha, no marriage plans, samantha and siddartha affiar

Samanahta is very furious over the rumours about his impending wedding with Siddardha.

నాకు ఎఫైర్ లేదు బాబోయ్ లేదు..

Posted: 07/24/2013 11:34 AM IST
Siddharth denies love affair with samantha

ప్రస్తుతం మంచి ఫాంలో దూసుకుపోతున్న హీరోయిన్ సమంతా పై గత కొంత కాలంగా హీరో సిద్దార్థ తో ఎఫైర్ ఉన్నట్లు వీరిద్దర త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తల పై ఇది వరకే చాలా సార్లు ఇరువురు స్పందించి మా మధ్య ఉన్నది ఎఫైర్ కాదని, కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనని చెప్పినా వీరిద్దరి పై రూమర్లు మాత్రం ఆగడం లేదు. ఈ వార్త పై తాజాగా స్పందిస్తూ... ‘మా మధ్య మీరు అనుకుంటున్నది ఏమీ లేదు ... మమ్మల్నిలా వదిలేయండి ’... ప్రతి రోజూ ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చానెల్ చూసినా నా గురించే ఇలాంటి షాకింగ్ న్యూస్ ఇస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యంగా నా నిర్మాతలు ఆందోళన పడకూడదన్న ఉద్దేశంతో, ఇలా స్పందించాల్సి వస్తోంది. నా వ్యక్తిగత విషయాలపై మీడియా అత్యుత్సాహం చూపించడం నన్ను బాధిస్తోందని ప్రస్తుతం  కెరియర్ పైనే మనస్సు నిమగ్నం చేశానని, పెళ్లి ఆలోచనే లేదని చెప్పుకొచ్చింది. నేను ఎవర్నైనా ప్రేమిస్తే అందులో దాచుకోవాల్సిందేముందని, తప్పకుండా చెబుతానని ఇక పైనా నా పై వచ్చే రూమర్లకు పుల్ స్టాప్ పెట్టండని మీడియా వారిని వేడుకొంది. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి విషయమైనప్పుడు తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయితోనే తన పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చింది. మొన్నటి వరకు ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పిన సమంతా ఇప్పుడు ఇలా చెప్పడంతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles