Attarintiki daredhi audio launch directly

power star Attarintiki Daredhi Audio Launch, launch audio attarintiki daredhi, directly into the market,without any function, director trivikram also reacted positively, gabbar singh, samantha

Attarintiki Daredhi Audio Launch Directly,

పవన్ సినిమా ఆడియో ఫంక్షన్ ఉండదా ?

Posted: 07/03/2013 11:40 AM IST
Attarintiki daredhi audio launch directly

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అత్తారింటికి దారేది చిత్రం ఆడియోని ఈనెల 14వ తేదీన విడుదల చేయబోతున్నారని, ఆ తేదీని కూడా ఖరారు చేశారని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సన్నిహితుల నుండి, ఆ చిత్ర యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. అంగు ఆర్బాటాలకు దూరంగా ఉండే పవన్ ఈ సినిమా ఆడియోను కూడా హడావుడి లేకుండా విడుదల చేయాలని భావిస్తున్నాడని, ఇదే విషయాన్ని దర్శకుడు త్రివిక్రమ్ కి చెబితే... అతను కూడా ఒప్పుకున్నాడని అంటున్నారు. గతంలో గబ్బర్ సింగ్ ఆడియోను సాదా సీదాగా మార్కెట్లోకి విడుదల చేశాడు. తరువాత విజయోత్సవ సభ ఉంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అది కూడా పవన్ వద్దనడంతో నిర్వహించలేదు. అలా చేయడంతో ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అదే సెంటిమెంటును ఈ సినిమాకు ఫాలో అవ్వాలని పవన్ అనుకుంటున్నాడట. గతంలో పులి లాంటి సినిమా ఆడియోను హంగు ఆర్జాటాలతో నిర్వహిస్తే డిజాస్టర్ కావడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటున్నారు. మరి పవన్ అభిమానుల ఆశను నెరవేరుస్తాడో లేక ఎప్పటిలాగే నిరాశ పరుస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles