Allu sirish gouravam

allu sirish gouravam, allu sirish, gouravam, prakash raj irritates on gouravam movie, radha mohan, allu aravindu son allu sirish gouravam, yamigowtham in gouravam, ipl match, mega family,

allu sirish gouravam

అల్లు శిరీష్ నమ్మకం

Posted: 04/07/2013 06:23 PM IST
Allu sirish gouravam

సినీ వారసులకి సినీ రంగ ప్రవేశం పూల పాన్పు అని మరొక్క సారి రుజువు చేసాడు మెగా వంశం తో ఏకమైన అల్లు వంశం ఇంకో వారసుడు , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు , స్టార్ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు , అల్లు శిరీష్ ...

 తొలుత సహాయ నిర్మాత గా , తన తండ్రి తీసిన ఎన్నో సినిమాలకి భాద్యతలు నిర్వహించిన అల్లు శిరీష్ కి , తన అన్న అర్జున్ ని చూసి తాను కూడా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక పుట్టిందో ఏమో , అనుకున్నదే తడవుగా , నటుడికి కావాల్సిన కొన్ని మెళుకువలు తెలుసుకుని , మెరుగులు దిద్దుకుని 'గౌరవమ్' అనే విన్నూత్న కధాంశం తో రూపొందించే చిత్రం ద్వారా హీరో గా పరిచయం అవుతున్నాడు ... హిందీ పరిశ్రమలో 'విక్కీ డోనర్' వంటి హిట్ చిత్రం ద్వారా కధానాయిక గా రంగ ప్రవేశం చేసిన యామీ గౌతమ్ ఈ చిత్రం లో హీరోయిన్ ... నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాణం లో ఈ చిత్రం త్వరలో విడుదల కు సిద్ధం అయ్యింది ...

 

 తెలుగు సినీ పరిశ్రమని తన సంగీతం తో ఉర్రూతలూగిస్తున్న తమన్ ఈ చిత్రానికి కూడా కొన్ని అద్భుతమైన బాణీలు అందించాడు . ఈ చిత్రం ఆడియో ఈ మధ్యనే విడుదల అయ్యింది . చిత్రం ట్రెయిలర్స్ చూస్తూ ఉంటె , కొత్త తరహా కధాంశం తో రూపొందిన చిత్రం అని అర్ధం అవుతుంది . 'గౌరవమ్ ' విజయం సాధించడం ఈ చిత్ర దర్శకుడు , రాధా మోహన్ కు నిజంగానే 'గౌరవమ్ ' ...

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles