Andala rakshasi hero rahul in suresh productions

andala rakshasi, rahul ravindran, suresh productions, pattudala movie

rahul ravindran of andala rakshasi fame strikes jackpot

Rahul in Suresh productions.gif

Posted: 02/15/2013 02:57 PM IST
Andala rakshasi hero rahul in suresh productions

    

     rahul_copy

అందాల రాక్షసిలో హీరోగా చేసి అందులో తను చూపించిన ప్రతిభకు ప్రతిఫలంగా బూరెల బుట్టలో పడ్డాడని సినిమా ప్రపంచమంతా అనుకుంటోంది.  హను రాఘవపూడి దర్శకత్వంలో తయారైన అందాలరాక్షసిలో మార్కులు కొట్టేసిన రాహుల్, పెళ్ళిపుస్తకం తో రెండవ ఖాతా తెరిచి, ఆ సినిమా నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే మూవీమొఘల్ సామ్రాజ్యంలో చోటు సంపాదించుకున్నాడు. 


     సురేష్ ప్రొడక్షన్స్ పతాకం కింద, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సినిమాకి దర్శకత్వం వహించి బహుమతి అందుకున్న సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో హీరోగా రాహుల్ అవకాశం అందుకోవటం అతన్ని చిత్రసీమలో కచ్చితంగా అందలం ఎక్కిస్తుందని అందరూ అనుకుంటున్నారు.  భలబద్రపాత్రుని రమణి రాసిన కథ ఆధారంగా పట్టుదల అనే పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నది శ్రీలేఖ. 


     ప్రస్తుతం నిర్మాణం చివరిదశలో ఉన్న అందాల హీరో రాహుల్ సినిమా పెళ్ళిపుస్తకంలో మేము వయసుకి వచ్చాం సినిమాలో చేసిన నాయిక నితి టైలర్ కథానాయికగా పనిచేస్తోంది.  తాజా సినిమా పట్టుదలలో రాహుల్ సరసన ఎవరు సినిమాకి శృంగారపు రంగుని అద్దుతారన్నది నిర్మాతలు ఇంకా నిర్ధారించలేదు. 


     మొత్తానికి రాహుల్ ఇప్పుడు దొరికిన అవకాశంతో కొన్నాళ్ళపాటు సినీజగత్తులో రాజ్యమేలుతాడని చాలామంది అభిప్రాయవడుతున్నారు.  బుధవారం నిరాడంబరంగా జరిగిన పట్టుదల సినిమా ప్రారంభ మహోత్సవంలో హాజరైన పెద్దలంతా రాహుల్ కి ఉజ్వల భవిష్యత్తుంటుందని దీవించారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Movie starts with anuskha as rudramadevi
Neha sharma turns cold  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles