Prabhas and rana brothers roles

prabhas, rana, rajamouli, prabhas movies, rana daggubati movies, rajmouli movies, rana prabhas brothers roles, mirchi, krishnamvande jagadgurum, magadhira, rajamouli films

prabhas and rana brothers roles

1.gif

Posted: 01/10/2013 10:18 AM IST
Prabhas and rana brothers roles

pra_ra_ra

       ప్రభాస్ తో కలిసి రానా దగ్గుబాటి నటిస్తాడా లేదా అన్న మీమాంసకు తెరపడింది. ప్రభాస్ సోదరుడిగా నటించడానికి రానా దగ్గుబాటి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందే చారిత్రాత్మక కథా చిత్రంలో రానా కూడా నటించే అవకాశం ఉందని ఇంతకుముందే వివరిచాం. ఇదే ఇప్పుడు నిజమైంది.  ఇందుకు సంబంధించి రాజమౌళి, రానా మధ్య తాజాగా జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. తన పాత్ర స్వరూప స్వభావాలు నచ్చడంతో రానా ఓకే అన్నాడు. అయితే, ఇందులో ప్రభాస్, రానా పోషించే అన్నదమ్ముల పాత్రలు పరస్పర  వైరుద్యంతో సాగుతాయి. రానా పాత్ర నెగటివ్ ఛాయలతో ఉంటుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి.

Mirchi_9660

        ఇదిలా ఉండగా ప్రభాస్ – అనుష్క తాజా చిత్రం మిర్చి ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి బయటకు వస్తున్న చిత్రాలు ఈ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన అనుష్క – ప్రభాస్ వర్కింగ్ స్టిల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇందులో  భారీ అందాల భామ అనుష్క, ప్రభాస్ ను అమాంతం పైకెత్తేసింది. ఎదురుగా చెట్టుకు వేలాడుతున్న  మామిడికాయలు నోరూరిస్తుంటే... వాటిని ఓ పట్టు పట్టమంటూ పట్టుబట్టి ఇలా ఎత్తి పడేసింది. అనుష్క మజాకా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prakash raj official youtube channel
Minister botsa satyanarayana son tollywood entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles