Kamal viswaroopam dth release first

Kamal Viswaroopam, Kamal Viswaroopam movie, Kamal Viswaroopam first release on DTH, TV shows.

Kamal Viswaroopam DTH release first.

Kamal Viswaroopam DTH release first.png

Posted: 12/26/2012 04:51 PM IST
Kamal viswaroopam dth release first

Kamal_Viswaroopam_dth

విలక్షణ నటుడు కమల్ హాసన్ తాజాగా తను నటించి, దర్శకత్వం వహించిన ‘ విశ్వ రూపం ’ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఆయన డైరెక్టుగా బుల్లి తెర పై వదులుతున్నాడు. సినీ చరిత్రలోనే మొదటి సారిగా కమల్ చేస్తున్న ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ, ఈ విషయంలో కమల్ కి ఒత్తిళ్ళు, విమర్శలు మాత్రం బాగా పెరిగాయి. కమల్ చేస్తున్న ఈ ప్రయోగం పై థియేటర్ యాజమానులు మండి పడుతున్నా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు.  చిత్రాన్ని మొదట్లో ప్రకటించినట్టు పది గంటలు ముందుగా డీటీహెచ్ ద్వారా టీవీలో ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడు. ఎయిర్ టెల్ డీటీహెచ్ ద్వారా ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లను జనవరి 10 రాత్రి 9 గంటల 30 నిమిషాలకి ప్రసారం చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో కనెక్షన్ నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు కమల్ చెబుతున్నాడు. ధియేటర్ కి వెళ్లి సినిమా చూడడానికి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే, ఇదేమంత పెద్ద ఖర్చు కాదని కూడా అంటున్నాడు. ఇప్పటికే 50 కోట్లకు అమ్మేయడం వల్ల ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు.  ఈ సినిమా పై వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టిన కమల్ ఆ మొత్తాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఇలా ప్రయోగాలు చేస్తున్నాడు. కమల్ చేస్తున్న ఈ విశ్వప్రయత్నం ఫలించి లాభాల బాట పడుతాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh guest role in pawan kalyan movie
Nose injury for ram charan nayak shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles