వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఆడియో నిన్న రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్డూడియో గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియోను విడుదల చేశారు. ఈ ఆడియోకు సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని వినూత్న శైలిలో నిర్వహించారు . సమంత అంజలి హీరోయిన్స్. ప్రకాష్‌రాజ్, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్ర ఆడియో విశేషాలు మీకోసం....
ఈ సినిమాకి ప్రత్యేకమైన గెస్ట్ లు ఎవరూ రాలేదు. ఇక ఈ సినిమా తొలి సీడీని వెంకటేష్ కుమారుడు అర్జున్ ఆవిష్కరించి మహేష్‌బాబు తనయుడు గౌతమ్ కృష్ణకి అందజేశారు. మహేష్ బాబు మాట్లాడుతూ... వెంకటేష్‌తో పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ''కొత్త కొత్త అనుభూతుల్ని కలిగించిన చిత్రమిది. కృషి, అంకితభావం కలిగిన నటుడాయన. నేను ఆయన్నుంచి చాలా నేర్చుకొన్నాను. శ్రీకాంత్ పదిహేను నిమిషాలు ఈ కథ చెప్పాడు. వినగానే చాలా బాగా నచ్చింది. అవుట్‌స్టాండింగ్ ఆడియో ఇచ్చాడు మిక్కీ. బహుశా ఇది అతని కెరీర్‌లో బెస్ట్ ఆల్బమ్ అయ్యుండొచ్చు. అని అన్నారు. ఇక వెంకటేష్ మాట్లాడుతూ...''ఒక నటుడిగా నాకు తీపి జ్ఞాపకాలెన్నింటినో పంచిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సెట్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మహేష్‌బాబు నాకు తమ్ముడైపోయాడు. చక్కటి కుటుంబ కథ ఇది. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి కలిగిస్తుందనే నమ్మకంతోనే తీశాం. మహేష్, నేను ఒకరికొకరం దగ్గరయ్యాం. అని అన్నాడు.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ... మహేష్, వెంకటేష్ ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. నా జీవితంలో నాకెదురైన కొన్ని అనుభవాలతో తెరకెక్కిన చిత్రమిది. మా అన్నయ్య అచ్చం వెంకటేషే. ఈ సినిమాకి నేను దర్శకుడ్ని కావడం నా పూర్వజన్మ సుకృతం. నిరాడంబరంగా, ఆనందంగా ఉండడమెలాగో చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది'' అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ''మా సంస్థ సినిమాలు తీయడం ప్రారంభించి పది సంవత్సరాలైంది. పదోయేట ఒక మల్టీస్టారర్ సినిమా తీయడం నా అదృష్టం. శ్రీకాంత్ ఇద్దరు హీరోలు కావాలి అన్నప్పుడు కుదరదని చెప్పాను. కానీ చాలా పట్టుబట్టాడు. వెంకటేష్ ముందే ఈ కథను ఒప్పుకొన్నారు. 'దూకుడు' సెట్‌లో మహేష్‌బాబుకి కథ చెప్పాం. వీళ్లిద్దరూ సినిమాలో నిజమైన అన్నదమ్ముల్లా ప్రవర్తించారు. సినిమాపై ప్రేమతో నటించారు. కలిసుందాం రా, మురారి కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది,. మిక్కీ జె మేయర్‌ని సంగీతదర్శకుడిగా తీసుకుందామని శ్రీకాంత్ అంటే... ఇంత పెద్ద హీరోలకు సాఫ్ట్ మ్యూజిక్ ఇచ్చే అతనా? వద్దన్నాను. కానీ మిక్కీ టైటిల్ సాంగ్ వినిపించగానే 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను. 20ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ తీస్తాను. అది కూడా గౌతమ్, అర్జున్‌తో...''అన్నారు. మొత్తానికి అంగరంగా వైభంగా జరిగిన ఈ ఆడియో ఫంక్షన్ ప్రేక్షకులకు వీనుల విందు చేసింది. పాటలు కూడా బాగా ఉన్నాయి. సినిమా కూడా బాగా ఉంటుందనే ఆశిద్దాం.
ఈ సినిమా ఆడియో ట్రాక్ లిస్ట్ ఇది.
1. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సింగర్స్: చిత్ర,కోరస్
2 ఏం చేద్దాం సింగర్స్ :
రంజిత, శ్రీ రామ్ చంద్ర, కార్తీక్
3 ఆరడుగులు ఉంటాడా
సింగర్స్: కళ్యాణి
4 ఇంకా చెప్పాలా
సింగర్స్ : రాహుల్ నంబియార్, శ్వేత పండిట్
5 మేగాల్లో...
సింగర్స్: శ్రీరామ్ చంద్ర, కార్తీక్
6 మరీ అంతగా
సింగర్స్ : శ్రీరామ్ చంద్ర
7 వాన చినుకులు
అంజన సౌమ్య, కార్తీక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more