Venkatesh maheshbabu manchu vishnu

venkatesh-maheshbabu-manchu-vishnu, sitamma vakitlo sicimalle chettu, denikaina ready

venkatesh-maheshbabu-manchu-vishnu

19.gif

Posted: 09/15/2012 07:26 PM IST
Venkatesh maheshbabu manchu vishnu

       విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఆన్ స్క్రీన్ మీద అన్నదమ్ములుగా తెరకెక్కుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర విడుదల తేదీని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నట్లు దిల్ రాజు చెప్పారు. ఇటీవలే చెన్నై షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు 78 రోజుల mahesh_iner_2షూటింగ్ పూర్తి చేసుకోగా ఇంకా 30 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 15 వరకు మొత్తం షూటింగ్ పూర్తి చేసి అదే నెల మూడవ వారంలో ఆడియోని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అయన తెలిపారు.
    మంచు విష్ణు, హన్సిక జంటగా నటిస్తోన్న చిత్రం రిలీజ్ డేట్ కన్పామ్ అయింది. దీనికి సంబంధించిన ప్రకటనను ఆచిత్ర దర్శకుడు మీడియోతో మాట్లాడారు.  24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘దేనికైనా రెడీ’. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మోహన్‌బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పాటలను యూరప్, థాయిలాండ్‌లలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గత నెల 24నుండి పాటల చిత్రీకరణ జరుపుతున్నామని, పూర్తి వినోదాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, ఈనెల 23న పాటలను విడుదల చేసి, చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
       బ్రహ్మానందం, రోజా, విక్రమ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, మాటలు: గోపీ మోహన్,కోనా వెంకట్, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: సిద్దార్థ్, దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suttivelu life history
Rajamouli donation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles