Ntr badsha seven getups

ntr badsha seven getups, firstlook responce,

ntr badsha seven getups

17.gif

Posted: 09/03/2012 07:38 PM IST
Ntr badsha seven getups

        badsha_innయంగ్ టైగర్ యన్టీఆర్ శ్రీను వైట్ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'బాద్ షా' ఫస్ట్ లుక్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. బాద్ షా కొత్త హెయిర్ స్టైల్ తో అదరగొట్టాడు. అంతేకాదు ఇంకా ఈ సినిమాలో యన్టీఆర్ మరో ఆరు హెయిర్ స్టైల్స్ తో కనిపించి అభిమానులను అలరించనున్నాడు. భారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద తాజా వార్తతో మరిన్ని అంచానాలు మొదలయ్యాయి. ఇందులో యన్టీఆర్ కి జంటగా ముంబాయి ముద్దు గుమ్మ కాజల్ నటిస్తోంది. నవదీప్, కెల్లీ దోర్జీ ప్రతినాయక పాత్రలలో కనిపించనున్నారు. సంక్రాంతి బరిలో దిగాలని చూస్తున్న 'బాద్ షా'కి బాణీలు అందించటంలో తమన్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆడియోని డిసెంబర్ లో విడుదల చేయాలని చూస్తున్నారు.roopa_vitla
       ప్రస్తుతం 'బాద్షా' చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతవరకూ కొన్ని కీలకమైన సన్నివేశాలను ... పాటలను అక్కడి అందమైన లోకేషన్లలో చిత్రీకరించారు. ముందుగా వేసుకున్న షెడ్యూలు ప్రకారం ఈ షూటింగ్ సెప్టెంబర్ 25 వరకూ అక్కడే జరగవలసి ఉంది. అయితే అనుకున్నదాని కంటే త్వరగా షూటింగ్ జరగడం ... ఈ లోగా కొన్ని సన్నివేశాల విషయంలో లొకేషన్ మార్చుకోవడం కారణంగా ఈ నెల 10 వ తేదీ లోగా అక్కడ షూటింగ్ ముగియనుంది. సెప్టెంబర్ 10 న తిరిగి వచ్చాక, తదుపరి షెడ్యూలును హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇంత వరకూ జరిగిన షూటింగ్ ప్రకారం సినిమా బాగా వచ్చిందనీ ... శ్రీను వైట్ల చాలా సంతోషంగా ఉన్నాడని ఆయన భార్య రూపా వైట్ల ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ala aite telugu movie
Ramcharan movie zangeer sonu sood sherkhan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles