'వర్షం' ... 'ఛత్రపతి'... 'మిస్టర్ పర్ ఫెక్ట్' చిత్రాలు సాధించిన ఘన విజయాలతో,యువ కథానాయకులకి గట్టి పోటీ ఇచ్చిన ప్రభాస్, అదే దూకుడుతో 'రెబల్' ... 'వారధి' చిత్రాలను అంగీకరించాడు. అయితే 'రెబల్' షూటింగు సమయంలో తలెత్తిన ఇగోల గోల ప్రభాస్ దూకుడుకి కళ్లెం వేసింది. ఈ సినిమా ముందుగా పూర్తి చేద్దామని ప్రభాస్ అనుకోవడం వల్ల 'వారధి' సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఫలితంగా ఈ రెండు సినిమాలు రాకుండానే దాదాపు ఏడాదిన్నర కాలం గడిచిపోయింది.
ఇక ఎన్ని వివాదాలు తలెత్తినా 'రెబల్'పై అభిమానులకి కొన్ని అంచనాలు ఉన్నాయి. కానీ 'వారధి' విషయానికి వస్తే టైటిల్ దగ్గర నుంచి అభిమానులు ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. కాబట్టి ప్రభాస్ హిట్ అంటూ కొడితే అది 'రెబల్' విషయంలోనే జరగాలి. ఈ నేపథ్యంలో 'రెబల్' ఆడియోను సెప్టెంబర్ 14 న ... సినిమాను సెప్టెంబర్ నెలాఖరున విడుదల చేస్తున్నట్టు ఇవాళ ప్రకటించారు. ఈ మూవీకి తమన్నా బాగా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో చాలా సెక్సీగా కనబడే అవకాశం ఉందని తాజాగా వచ్చిన స్టిల్ చూస్తే ఇట్టే అవగతమవుతుంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ చూసిన ప్రతి ఓక్కరూ తమన్నా సూపర్ అంటారంటున్నారు.. రెబల్ మూవీలో తమన్నా స్టిల్ మీకోసం..
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more