Happy birthday to kajal

happy birthday to kajal

happy birthday to kajal

1.gif

Posted: 06/19/2012 01:40 PM IST
Happy birthday to kajal

     'లక్ష్మీ కల్యాణం' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఈ ముంబాయి ముద్దుగుమ్మని చూసిన వాళ్లంతా అచ్చం లక్ష్మీదేవి లా ఉందన్నారు. ఆ తరువాత 'చందమామ' చిత్రంలో తళుక్కు మన్న ఈ అమ్మాయిని చూసిన వాళ్లు 'మచ్చలేని చందమామలా ఉందంటూ ముచ్చట పడిపోయారు. ఆ వెంటనే వచ్చిన 'పౌరుడు' ... ఆటాడిస్తా' చిత్రాలు ఆమెకి కాస్త నిరాశని కలిగించినా, 'మగధీరుడు' చిత్రం సాధించిన సంచలన విజయంతో ఆమె అగ్ర కథానాయికల జాబితాలోకి చేరిపోయింది.  యువరాణి పాత్రలో పసిడిబొమ్మలా ఉన్న ఆమెకి అశేష ప్రేక్షకులు అభిమానంతో అభిషేకం చేశారు. a
     అనంతరం ఎన్టీఆర్ జోడీగా చేసిన 'బృందావనం' ... ప్రభాస్ సరసన చేసిన 'మిస్టర్ పర్ఫెక్ట్' ... మహేష్ తో జట్టుకట్టిన 'బిజినెస్ మేన్' చిత్రాలు అగ్ర కథానాయికగా ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. ఇప్పుడు కాజల్ వైపు ఏ అవకాశమైనా కన్నెత్తి చూడాలంటే ... పెద్ద బ్యానరై వుండాలి ... కథానాయకుడు క్రేజ్ - ఇమేజ్ ఉన్న యంగ్ హీరో అయి వుండాలి ... అన్నిటికంటే ముందుగా ఆమెకి కథ ... కథనం ... తన పాత్ర నచ్చాలని అనుకునేంత స్థాయికి కాజల్ ఎదిగిపోయింది.  ఓ వైపున తెలుగులో ముందువరుసలో ఉన్న ఎన్టీఆర్ ... మహేష్ ... రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో జట్టు కడుతోన్న కాజల్, తమిళ్లో సైతం ఇదే ఫార్మూలాని అనుసరిస్తోంది. సూర్య ... విజయ్ వంటి కథానాయకులతో ఆమె చేస్తోన్న చిత్రాలే అందుకు నిదర్శనం. ఇక బాలీవుడ్లో సైతం విజయ బావుటా ఎగరేసిన ఈ భామ కోసం అక్కడి హీరోలు ... దర్శక నిర్మాతలు కూడా వెయిటింగ్ లో వున్నారు.
     aaఈ మధ్య కాలంలో ఈ స్థాయి సక్సెస్ ని అందుకున్న కథానాయికలు లేరు. ఆమెకి కూడా ఇంతటి విజయం అవలీలగా అందలేదు. దాని వెనుక ఆమె పట్టుదల ... కృషి ... అన్నిటికీ మించి ఆమె మంచితనం దాగి ఉన్నాయి. అందం ... అభినయమే కాదు, అంతకి మించిన వ్యక్తిత్వం కూడా ఉన్నతమైన స్థానాన్ని అందిస్తుందని కాజల్ మరోసారి నిరూపించింది. చక్కని అందంతో ... చిక్కనైన అభినయంతో ... సక్సెస్ కి ప్రతీకలా నిలిచిన కాజల్  పుట్టిన రోజు ఇవాళ ఈ సందర్భంగా ఈ అందాల రాశికి ఆంధ్రావిశేష్.కాం బర్త్డే విషస్ చెబుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayana tara takes new steps
Eega latest progress report  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles