Ntr movie badshaa music sittings

ntr movie badshaa music sittings

ntr movie badshaa music sittings

3.gif

Posted: 05/07/2012 02:18 PM IST
Ntr movie badshaa music sittings

      nt_in యంగ్ టైగర్ యన్టీఆర్ నటించబోయే తాజా చిత్రం 'బాద్ షా' సినిమా షూటింగు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోపక్క ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచీ ఈ చిత్రానికి సంబంధించిన బాణీల రూపకల్పన ఊటీలో నిర్వహిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు తమన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు ఈ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారు.
       కాగా, ఈ సినిమా ట్యూన్స్ కడుతుంటే చాలా సంతోషంగా ఉందంటున్నారు ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఎందుకంటే ప్రతీ బాణీలోనూ విభిన్న రూపకల్పన వల్ల ప్రతీ పాటా చాలా అపురూపంగా వస్తున్నాయని అంటున్నారు.tama  అంతేకాదు.. ఈ సినిమాలో పాటలకి దర్శకుడు చక్కని సందర్భాలను ఇచ్చారు. ఓ విధంగా చెప్పాలంటే, వీటికి పాటలు చేయడం నాకొక సవాలే. అయితే, ఆయా సందర్భాలకు బాణీలు కడుతుంటే చాలా ఎగ్జయిట్ అవుతున్నాను. ఇప్పటికే ఓ ట్యూన్ రెడీ అయింది కూడా' అంటున్నాడు సంగీత దర్శకుడు తమన్. ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా తమన్ ‘బాద్ షా’ మ్యూజిక్ గురించి పలుమార్లు ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
      త్వరలో ప్రారంభం కానున్న ‘బాద్ షా’ షూటింగ్ 50 రోజులపాటు ఇటలీలో ప్లాన్ చేశారు. శ్రీను వైట్ల శైలి కామెడీతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఇంతకుముందు యంగ్ టైగర్  కాజల్ తో ‘బ్రుందావనం’లో నటించి రక్తి కట్టించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan compliments devi sri prasad
Pawan kalyans movie festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles