Camedy hero sunil birth day today

camedy hero, sunil, birth, day today

camedy hero sunil birth day today

1.gif

Posted: 02/28/2012 01:25 PM IST
Camedy hero sunil birth day today

          su1 నవతరం నవ్వుల రారాజు సునీల్. ఆయన సినిమాలో కనిపిస్తే చాలు పంచ్ ఫలక్ నామానే..  తన కష్టంతో ఇష్టంతో కేమెడీ యాక్టర్ నుంచి హీరోగా ఎదిగిన పూలరంగడు సునీల్ పుట్టిన రోజు ఇవాళ.  ఫిబ్రవరి 28,1974 లో సునీల్ వర్మ గా పుట్టిన మన తాజా హీరో నేటితో 38 వసంతాలు పూర్తి చేసుకున్నారు.su2
           తన బాల్యం అంతా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో గడిపిన సునీల్ తన ఐదవ ఏటనే తండ్రిని కోల్పోయారు. డాన్స్ మీద ఉన్న ఆసక్తి చిరంజీవి గారంటే ఉన్న అభిమానం ఆయన్ని సినిమా వైపు వచ్చేలా చేసింది. బి.ఏ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చేసిన సునీల్ డాన్సర్ గా,ఆర్ట్ డైరెక్టర్ గా విలన్ గా కూడా ప్రయత్నించారు. su3

         అయితే “నువ్వే కావాలి” చిత్రం లో అవకాశం వచ్చాక ఇంకా వెను తిరిగి చూడలేదు. పరిశ్రమ లో పెద్ద హాస్యనటుడు అయ్యారు. తరువాత “అందాల రాముడు” చిత్రం తో కథానాయకుడి గా మారిన సునీల్ “మర్యాద రామన్న, పూల రంగడు” చిత్రాల విజయం తో మంచి కథానాయకుడు అయ్యాడు. ఈ చిత్ర విజయంతో సినీ పరిశ్రమలో దిగ్గజాలు సైతం సునీల్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
          సునీల్‌ మూడేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం 'పూలరంగడు'...అని ఆ  చిత్రం ప్లాటినం వేడుక సందర్భంగా దాసరినారాయణరావు, కోట శ్రీనివాసరావు  కీర్తించారు. అంతేకాదు కమేడియన్‌గా వచ్చి హీరో అయిన కోవలో గతంలో చాలామంది ఉన్నారు. సునీల్‌ ఆ కోవలోనే ఉంటూ.. చాలా కష్టపడి బాడీని తగ్గించుకుంటూ చేశాడు. ఒకానొక సమయంలో.. ఇది సునీల్‌కు అవసరమా అనిపించింది. సినిమా చూశాక.. అవును అవసరమే అనిపించిందని దాసరి మనసులో మాట సైతం వినమ్రంగా బయటపెట్టారు. dasari_greets_sunil
          తన నవ్వులతో ప్రేక్షకుల మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన సునీల్ హీరోగానూ అందరినీ కడుపారా నవ్విస్తూ మరింత పైకెదగాలని ఆంధ్రావిశేష్.కామ్ ఆకాంక్షిస్తోంది. హ్యాపీ బర్త్ డే సునీల్.............


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actress sreddha das in hotel taj krishna
Matran movie press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles