Weak China, India PMI data drag markets sixth straight day

Sensex nifty fall for 6th consecutive day bajaj auto falls over 4 percent

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Auto stocks and midcap & smallcap earnings were in focus today. Bajaj Auto tanked nearly 5 percent after reporting a 9 percent year-on-year decline in October sales

వరుసగా 6వ రోజు దేశీయ సూచీలకు నష్టాలు..

Posted: 11/02/2015 06:45 PM IST
Sensex nifty fall for 6th consecutive day bajaj auto falls over 4 percent

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో వరుసగా ఆరవ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. విదేశీ మార్కెట్ల ప్రతికూల పవనాలకు తోడు చైనాలో ఆర్థికస్థితి తిరోగమనం దిశగా సాగడం కూడా తోడైంది. దీనికి తోడు అక్టోబర్ మాసంలో ఉత్సాదక రంగంలో చవిచూసిన నష్టాలు కూడా మదుపరులు సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

ట్రేడింగ్ ప్రారంభంలోనే నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 8,032 వద్ద ట్రేడ్ అవ్వగా, సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 26,536 వద్ద ట్రేడ్ సాగించింది. ఆ తరువాత తీవ్ర ఒడిదోడుకులకు గురై మార్కెట్లు భారీ నష్టాలలో పయనించాయి. సెన్సెక్స్ 220 పాయింట్ల మేర, నిఫ్టీ 80 పాయింట్ల మేర నష్టాలను చవిచూశాయి. ఒక ధశలో నిష్టీ 8 వేల మార్కుకు దిగువకు చేరింది. కాగా ముగింపు సమయంలో క్రమంగా కోలుకున్న మార్కెట్లు భారీ నష్టాలను భర్తీ చేసుకునే పనిలో పడటంతో.. చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి దీంతో మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 98 పాయింట్లు నష్టాన్ని మూటగట్టుకుని 26 వేల 559 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 15 పాయింట్లు నష్టంతో 8,051 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

ఈ క్రమంలో కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంజీసీ, ఐటీ, ఆయల్ అండ్ గ్యాస్ సూచీలు లాభాలను గడించగా, అటో, బిఎస్సీ బ్యాంకింగ్, టెక్నాలజీ, మిడ్ క్యాప్ సూచీలు స్వల్ప లాభాలను ఆర్జించాయి. కాగా క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, మెటల్స్ సూచీలు భారీగా నష్టపోగా, బ్యాంకింగ్ నిష్టీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మద్య తరహా, చిన్న తరహా పరిశ్రమల సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా, మహింద్రా అండ్ మహింద్రా, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, బజాజ్ అటో, హిండాల్కో, టాటా స్టీల్, వేదాంత, హెచ్ డి ఎఫ్ సి తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles