Asia India | Airoplane | Ruppe | Kilometer

Asia india offers one rupee for one kilometer charge to travel in its flights

asia india, airoplane, travels, delhi, banglore, goa, economy class

Asia india offers one rupee for one kilometer charge to travel in its flights. Asia india offers fantastic offer to travellers. One kilometer charge will be one rupee only.

కిలోమీటర్ కు ఒక్క రూపాయి.. ఆటో కాదు విమానానికి

Posted: 04/21/2015 05:50 PM IST
Asia india offers one rupee for one kilometer charge to travel in its flights

ఆటోలో ప్రయాణం చెయ్యాలంటే మీటర్ మీద ఎంత తీసుకుంటావు.. కిలో మీటర్ కు ఎంత తగ్గిస్తావు అని బేరమాతాం. ఇది మామూలే కానీ అసలు బేరం లేకుండా కేవలం ఓ కిలోమీటర్ కు ఒక్క రూపాయి అని ఎవరైనా ఆటో వస్తే ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి ఆటో కాదు ఏకంగా విమానం వస్తే ఎలా ఉంటుంది... ఏంటి కలో మీటర్ కు రూపాయి అది కూడా విమానం అని నమ్మడం లేదా.. కానీ నిజం నమ్మండి. ఈ మధ్య విమానాల టికెట్లు రేట్లు తగ్గాయని వార్త విన్నారు కదా అదే కోవలో తాజాగా కిలో మీటర్ కు రూపాయి ఛార్జ్ చేస్తున్నాయి విమానయాన సంస్థలు. అత్యంత చవక విమానయానానికి శ్రీకారం చుట్టిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ ఇప్పుడు సరికొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. ఆటోల కంటే కారు చవగ్గా.. కిలోమీటరుకు కేవలం ఒక్క రూపాయి చార్జీతోనే విమానం ఎక్కొచ్చని చెబుతోంది. తమ నెట్వర్క్లోకి ఢిల్లీని కూడా కొత్తగా చేర్చిన ఎయిర్ ఏషియా.. ఇందుకోసమే ప్రత్యేకంగా పరిమిత కాలానికి ఈ ఆఫర్ పెట్టింది. ప్రస్తుతం ఢిల్లీకి బెంగళూరు, గువాహటి, గోవాలతో కనెక్టివిటీ వచ్చింది.

ఢిల్లీ-గువాహటి మధ్య ప్రయాణానికి పదిహేను వందల రూపాయలు, ఢిల్లీ-గోవా, ఢిల్లీ-బెంగళూరు మార్గాలకు పదిహేడు వందల రూపాయలుగా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక కిలోమీటరుకు ఒక్క రూపాయి చార్జీ ఆఫర్తో టికెట్లను ఈనెల 26 వరకు బుక్ చేసుకోవచ్చు. మే 21 నుంచి మే 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మరి ఏషియా ఇండియా సంస్థ ఇచ్చిన ఆఫర్ అదిరింది కదూ మరి సూట్ కేస్ రెడీ చేసుకోండి. హ్యాపీ జర్నీ..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asia india  airoplane  travels  delhi  banglore  goa  economy class  

Other Articles