Narendra Modi launches Mudra Bank for small firms with Rs 20000 crore

Pm narendra modi launches rs 20000 crore mudra bank

PM Narendra Modi launches Rs 20000 crore MUDRA Bank, small entrepreneurs, mudra regulator for 'Micro-Finance Institutions', MUDRA Bank, Narendra Modi, PM Narendra Modi, Small entrepreneurs, Micro-Finance Institutions, Micro Units Development and Refinance Agency, Rs. 20000 crore

Prime Minister Narendra Modi launched MUDRA Bank which will provide credit of up to Rs 10 lakh to small entrepreneurs and act as a regulator for 'Micro-Finance Institutions' (MFIs).

యువభారతావనిలో యువత ఉపాధే లక్ష్యం: ప్రధాన మంత్రి మోడీ

Posted: 04/08/2015 05:28 PM IST
Pm narendra modi launches rs 20000 crore mudra bank

యువ భారతావనిలో ఎందరో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాది అవకాశాల కల్పన కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పెంపోందించాల్సిన అవసరం ఎంతైనా వుందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ద మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర బ్యాంకు)ను ప్రధానమంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.  5.77 కోట్లమంది ఉన్న చిన్న వ్యాపారులకు ముద్రా బ్యాంకు నుంచి ప్రయోజనం ఉందన్నారు. పెద్ద పరిశ్రమలు 1.25 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు.  చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 12 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్నాయని మోదీ తెలిపారు. ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

యువత స్వయం ఉపాధిని ఎంచుకని పరిశ్రమల స్థాపన చేయాల్సిందిగా కోరుతూ.. వారిని ఆ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం కూడా వుందని ప్రధాని అభిప్రాయప్డారు..కాగా ముద్ర బ్యాంకు చిన్న పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల వరకూ ఆర్థిక సాయం అందించనుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 5.77 కోట్ల చిన్నచిన్న వ్యాపార యూనిట్లు ఉన్నాయి. అలాగే ఈ బ్యాంకు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు నియంత్రణ బ్యాంకుగా వ్యవహరించనుంది. ముద్ర బ్యాంకును రూ.20వేల కోట్ల కార్పస్ ఫండ్తో, రూ.3వేల కోట్ల క్రెడిట్ గ్యారంటీ ఫండ్తో ఏర్పాటు చేస్తున్నట్లు అరుణ్ జైట్లీ గత బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించిన మేరకు ఈ బ్యాంకును ప్రారంభించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudra bank  narendra modi  Micro Units Development and Refinance Agency  

Other Articles