Sensex climbs 330 points nifty crosses 8300 level mark

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

The 30-share BSE index began day's trade on a positive note and a sudden spurt in buying in the last session lifted the index to 27,701.79 at close, a rise of 329.95 points from its previous close.

వారారంభంలో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

Posted: 12/22/2014 08:15 PM IST
Sensex climbs 330 points nifty crosses 8300 level mark

మదుపుదారుల కోనుగొళ్లకు తోడు ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఇవాళ దేశీయ సూచీలలో భారీ లాభాలతో ముగిసాయి. బీఎస్సీ  బెంచ్ మర్క్ సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో వారమున్నర క్రితం స్థాయి గరిష్టానికి చేరింది. గత వారంతంలో రెండు చివరి రోజులు కోనసాగించిన లాభాలను ఈ వారారంభంలో సెన్సెక్స్ కొనసాగించింది. ఇవాళ సెన్సెక్ 330 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించి ముగింపు సమయానికి 27 వేల 702 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజులుగా అనూహ్యంగా 991 పాయింట్లను సెన్సెక్స్ ఆర్జించింది. అటు నిఫ్టీ కూడా 8 వేల 3 వందల బెంచ్ మర్క్ ను దాటింది. ఏకంగా 99 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ 8324 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా భారీగా తగ్గిన చమురు దరలు మళ్లీ 62 డాలర్లుకు చేరడంతో ముదుపుదారలలో ఉత్సాహం నెలకోంది. ఇక ఏడాది పోడుగునా 60 అమెరికన్ డాలర్లకు మించిన ధరలే వుంటాయని వార్తలు మదుపుదారలను పెట్టుబడుల దిశగా ప్రేరేపించింది. లోహానికి సంబంధించిన షేర్లు ఇవాళ ర్యాలీని కొనసాగించాయి. మహింద్రా అండ్ మహింద్రా, కోల్ ఇండియా, హెచ్.డి.ఎఫ్.సి, బీహెచ్ఇఎల్, గెయిల్, ఎన్టీపీసీ సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, హిండాల్కో, ఎల్ అండ్ టి, టాటా స్టీల్, ఇన్పోసిస్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  Sensex  Stocks  Sensex today  BSE  NSE  

Other Articles