Kishore biyani future group on online trading discounts

future group online shopping, future group with amazaon, kishore biyani latest news, online shopping offers, online shopping discounts, online shopping sites, online products booking, why online shopping rates cheap, retail market growth in india

kishore biyani future group on online trading discounts : The euphoria over the scorching pace of eCommerce market in India will last about 18 months as things begin to settle down and reality sets says Future Group chief Kishore Biyani today

ఆన్ లైన్ డిస్కౌంట్ల ఆనందం మున్నాళ్ళ ముచ్చటే

Posted: 11/01/2014 06:52 PM IST
Kishore biyani future group on online trading discounts

అదరగొట్టే ఆఫర్లు, ఊరించే డిస్కౌంట్లు.. కొనాలన్న కోరికను పెంచే ప్రకటనలు ఇవన్నీ ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి సర్వ సాధారణం. ఒక ప్రొడక్ట్ ఫలానా సైట్ లో వంద రూపాయలకు దొరికితే మరొక సైట్ లో రూ.95కే వస్తుంది. ఇంకో సైట్ వెతికితే రూ. 90కి వస్తుంది. అప్పుడప్పుడూ రూ.50కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ ఆఫర్ల వెల్లువ మరెంతో కాలం ఉండదట. ఓ ఆరు నెలలు లేదంటే ఏడాదిన్నర కాలంలో ఆఫర్ల ఆనందం పోతుందని ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ చెప్తున్నారు. త్వరలోనే ధరల స్థిరీకరణ వస్తుందని.. ఇక విచ్చలవిడి ఆఫర్లు ఉండవని చెప్తున్నారు.

రిటైల్ మార్కెట్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ తో కలిసి ఈ మధ్యే ఈ కామర్స్ వ్యాపారం మొందలు పెట్టింది. ఈ సందర్బంగా మాట్లాడిన బియానీ.. ఫ్లిప్ కార్ట్ సహా ఇతర సంస్థల విధానాలను తప్పుబట్టారు. వస్తువు వాస్తవ ధరను తగ్గించి అమ్మటం వల్ల ఇతర వ్యాపారస్తులు నష్టపోవటం ఖాయమన్నారు. అంతేకాదు దీని వల్ల వస్తు ఉత్పత్తి కంపనీల నాణ్యతపై కూడా వినియోగదారులకు అనుమానాలు వస్తాయన్నారు. ఇలాంటి ఆఫర్లు మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతాయన్నారు.

ఆన్ లైన్ షాపింగ్ తో సాంప్రదాయ వ్యాపారస్తులు, షాపుల బిజినెస్ దెబ్బతింటుందా అనే ప్రశ్నకు బియాని బదులిస్తూ... సాంప్రదాయ వ్యాపారస్తుల బిజినెస్ నడుస్తుంది. అయితే గతంలో మాదిరిగా ఎక్కువ లాభాలు ఆర్జించలేరు అని చెప్పారు. మార్కెట్లో పోటి పెరిగిన కారణంగా.. నాణ్యమైన వస్తువు ఎక్కడ తక్కువకు లభిస్తే వినియోగదారుడు అక్కడకు వెళ్తారని వివరించారు. ఆన్ లైన్ షాపింగ్ మొదలు పెట్టినా.. తాము నిర్వహిస్తున్న ఆఫ్ లైన్ రిటైల్ వ్యాపారాలు యధాతధంగా కొనసాగుతాయన్నారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : e-commerce  offers  kishore biyani  business  

Other Articles