The costs of things are low in india than other counties

business news, business news of India, Indian price go down, Indian business in Telugu, costs in India lower than other counties, doish bank surveys, mapping the world prices surveys, the random walk surveys, Indian rupees, Indian currency going down

The costs of things are low in India than other counties and more

భారతదేశంలో వస్తువుల ధరలు చాలా తక్కువే!

Posted: 05/13/2014 02:11 PM IST
The costs of things are low in india than other counties

(Image source from: The costs of things are low in India than other counties)

రానురాను కాలక్రమంలో మార్పులు వస్తున్న విధంగా భారతదేశంలో కూడా ధరలలో మార్పులు సంభవించుకుంటున్నాయి. గృహ సంబంధిత అవసరాల ధరలు హద్దులు లేకుండా దాటిపోతున్నాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణం శాతం విపరీతంగా పెరిగిపోతోంది.

అయితే తాజాగా జర్మనీలోనే బ్యాంకింగ్ లో దిగ్గజం వహిస్తున్న డాయిష్ బ్యాంకు ‘‘ద ర్యాండమ్ వాక్, మ్యాపింగ్ ద వరల్డ్ ప్రైసెస్ - 2014’’ అనే పేరుతో ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. ‘‘అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశాలలో వస్తువుల ధరలు భారతదేశంలో చాలా తక్కువని వెల్లడయ్యింది. ఇది వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నప్పటికీ నిజమేనని ఒప్పుకోవాల్సిందే!

ఎందుకంటే... ద్రవ్యోల్బణ రేటు అధికంగా పెరిగిపోవడం వల్ల రూపాయి రేటు బలహీనంగా మారిపోయింది. తద్వారా ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో ఒకటైన భారత్ లోనే వస్తువులు చాలా చౌక ధరకు అందుబాటులో వున్నాయని జర్మనీ బ్యాంకింగ్ వ్యవస్థ డాయిష్ బ్యాంకు పేర్కొంటోంది. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఎక్కువ ధరలు వున్నాయని తేల్చి చెప్పింది. అలాగే తమ సర్వేలో మరికొన్ని వివరాలను కూడా ఈ క్రిందివిధంగా వెల్లడించింది.

* ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలలో అమెరికాలో వస్తువుల ధరలు చాలా తక్కువగా వున్నాయి.

* ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వర్దమాన దేశాల్లో బ్రెజిల్ లో ధరలు చాలా అధికంగా వున్నాయి.

* కార్ల ధరలు సింగపూర్ లో చాలా ఎక్కువగా వున్నాయి. అదేవిధంగా హాంకాంగ్ లో కార్యాలయ అద్దెలు ఎక్కువగా వున్నాయి.

* కార్ల అద్దెలు, బ్రాండెడ్ వస్తువుల ధరలు చైనాలో చాలా తక్కువగా నమోదయ్యాయి. కానీ అమెరికా ధరలతో పోల్చితే మాత్రం ఇవి చాలా ఎక్కువ. అందులో ముఖ్యంగా లెవీ జీన్స్, అడిదాస్ షూస్, ఐఫోన్లు వంటి మొదలైన బ్రాండెడ్ వస్తువుల ధరలు అమెరికాలో కంటే చైనాలో చాలా ఎక్కువగా వున్నాయి.

* సినిమాలకు, డేటింగ్ లకు భారత నగరాల్లో మొత్తం వారంతంలో కూడా ఖర్చులు చాలా తక్కువగా వుంటున్నాయి. అలాగే వారంతపు సెలవుల్లో కౌలాలంపూర్, ముంబయి వంటి నగరాల విహారయాత్రలకు తక్కువ ఖర్చులు అవుతుండగా.. సిడ్నీలో మాత్రం డబ్బులను అధికంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles