The History Of Jainath Temple Which Is Located In Adilabad Dist | Indian Famous Temples List

Jainath temple adilabad history special story indian famous temples list

jainath temple, adilabad temples, indian temples, hindu temples, jainath temple history, jainath temple adilabad, famous temples in telangana, telangana temples

Jainath Temple Adilabad History Special Story Indian Famous Temples List : The History Of Jainath Temple Which Is Located In Adilabad Dist Jainath Village.

తెలంగాణాలో పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న ‘జైనాథ్’ ఆలయం

Posted: 07/14/2015 12:58 PM IST
Jainath temple adilabad history special story indian famous temples list

జైనాథ్ ఆలయం... తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలో వున్న దేవాలయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. అదిలాబాద్ జిల్లాలో చుట్టుపక్కల వున్న దర్శనీయ స్థలాల్లో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఆలయం అదిలాబాద్ కు 21 కిలోమీటర్ల దూరంలో జైనాథ్ గ్రామంలో వుంది. ఈ ఆలయ మూలవిరాట్టు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. చాలా పురాతనమైన ఆ ఆలయం దగ్గరున్న శిలాశాసనాలను, ఆలయ గోడలపై చెక్కిన దాదాపు 20 శ్లోకాలను బట్టి ఈ పవిత్ర దేవాలయాన్ని పల్లవ రాజులు నిర్మించారని చరిత్ర చెబుతోంది.

పల్లవులు క్రీ.శ. 4 నుంచి 5వ శతాబ్దం వరకు అంటే దాదాపు 500 ఏళ్లు దక్షిణ భారతావనిని పరిపాలించారు. వారు పరాక్రమ వీరులే కాదు గొప్ప కళానైపుణ్యం కలిగిన వారు కూడా! హస్త కళలలో, శిల్పకళలలోను వారు సిద్ధహస్తులు. రాతిని చెక్కి అందమైన శిల్పాలుగా మార్చే కళలో ప్రసిద్ధులు. వారి కాలంలో అనేక ఆలయాలు చెక్కబడి అందమైన శిల్పసౌందర్యంతో అలరారుతున్న అధ్భుతమైన కళాఖండాలు దేశంలో వున్నాయి. వాటిల్లో ఈ జైనాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం జైన్ సంప్రదాయంతో అలరారుతోంది కాబట్టి.. దీనికి ‘జైనాథ్’ అని పేరు వచ్చింది. ప్రకృతి సిద్ధంగా లభించే నల్ల రాతితో ఈ ఆలయం నిర్మితమైంది.

మరిన్ని విశేషాలు :

* ప్రతి ఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగష్టు, మాసాలలోనూ దసరా అనంతరం వచ్చే ఆశ్వయుజ పౌర్ణమినాడు ఉదయం లక్ష్మీనారాయణుని పాదాలను ఉదయ కిరణాలు తాకుతుంటాయి. ఈ అధ్భుతదృశ్యం చూడటానికి భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు.

* కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు, పూజలు, జాతరలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ఆలయం భక్తుల రాకతో, యాత్రికులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది.

* సంతాన సాఫల్యత, కోరిన కోర్కలు తీర్చే దేవుడని భక్తుల నమ్మకం. జైనధ్ ఆలయం పర్యాటక కేంద్రంగా మారి చరిత్రలో అద్భుతమైన ఆలయంగా మారుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jainath temples  adilabad temples  hindu temples  

Other Articles