The Historical Story Of Kondagattu Anjaneya Swamy Temple | Hindu Temples India

Kondagattu anjaneya swamy temple history

kondagattu temple, kondagattu anjaneya swamy temple, hanuman temples, hanuman temples in india, kondagattu hanuman temple, hindu temples, kondagattu history

kondagattu anjaneya swamy temple history : The Historical Story Of Kondagattu Anjaneya Swamy Temple.

ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించే ‘కొండగట్టు’ ఆలయం

Posted: 07/15/2015 03:21 PM IST
Kondagattu anjaneya swamy temple history

కొండగట్టు ఆలయం.. తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. ఈ దేవాలయం కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామ సమీపంలో వుంది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు.. ప్రకృతి సౌందర్యము కలిగిన అద్భుతమైన ప్రదేశం. ఈ ఆలయంలోని ఆంజనేయుడు విగ్రహంలో ఒక విశేషం వుంది. ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలను ఆ విగ్రహం కలిగి వుంటుంది. ఈ విగ్రహాన్ని అక్కడి గ్రామస్థులే ప్రతిష్టించారు.

ఈ ప్రాంతానికి కొండగట్టు అనే పేరు ఎందుకొచ్చిందన్న విషయంపై ఓ పురాణగాధ వుంది. పూర్వం రాముడు, రావణ మధ్య యుద్ధం జరుగే కాలంలో లక్ష్మణుడు మూర్ఛ రోగంతో పడిపోయాడు. అప్పుడు ఆంజనేయుడు అతనిని సంరక్షించేందుకు సంజీవని తెచ్చేందుకు బయలుదేరాడు. హనుమ సంజీవనిని తెస్తున్నప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంతభాగం విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తారు. ఆ విధంగా ఆ ప్రాంతానికి కొండగట్టుగా పేరొచ్చింది.

kondagattu-anjaneya-03

దేవాలయ చరిత్ర :

400 సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణాలలో ‘సింగం సంజీవుడు’ అనే యాదవుడు వుండేవాడు. అతడు ఒకనాడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు ఆ ఆవుకోసం వెతకగా.. పక్కనే వున్న ఒక పెద్ద చింతచెట్టు కనిపించగా దానికంద సేదతీరడానికై కాసేపు నిద్రపోయాడు. అతని కలలో స్వామివారు కనిపించి.. ‘నేనిక్కడ కోరందపొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించు.. నీ ఆవు జాడ అదిగో’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.

అప్పుడు సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా.. ఆంజనేయుడు అతని కంటపడ్డాడు. ఆయన్ను చూడగానే అతనిలో భక్తిభావం పొంగి.. ఆయన్ని నమస్కరించాడు. ఇంతలోనే దూరం నుండి ఆవు పరిగెత్తుకు వచ్చింది. సంజీవుడు తన చేతిలో వున్న గొడ్డలితో కోరందపొదను తొలగించగా.. ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపం కనిపించింది. దానిని చూసి అతగాడు ముగ్ధుడై.. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు.

ఈ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయ దశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, ధనుర్మాసోత్సవం, గోదాకళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మేళా ఉత్సవం శ్రీ సుదర్శన యాగం మొదలైన ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీబేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది.

kondagattu-anjaneya-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : kondagattu temple  anjaneya swamy temples  hindu temples  

Other Articles