Serial killer jeffrey dahmer

jeffrey dahmer, serial killer, homosexual, gay, cannibal, necrophile, Ohio, Minneapolis, milwaukee, minority victims

Read about the Milwaukee serial killer that murdered, mutilated and cannibalized 17 young men and boys between 1978 and 1991.

Serial Killer Jeffrey Dahmer.gif

Posted: 12/20/2011 02:26 PM IST
Serial killer jeffrey dahmer

Serial_Killer_Jeffrey_Dahmer

సాదాసీదాగా కనిపించే కుర్రాడు... అవసరమైతే తప్ప మాట్లాడని అమాయకుడు...
తన పనేంటో తప్ప ఎవరి జోలికీ వెళ్లని మంచివాడు... అంతవరకూ అవే అతడికున్న బిరుదులు!
నరరూప రాక్షసుడు... జాలి అన్నదే ఎరుగని దుర్మార్గుడు... కరుణంటే తెలియని కిరాతకుడు...
నిజాలు తెలిశాక అతణ్ని అందరూ కసిగా తిట్టిన తిట్లు!!
మంచివాడనుకున్న వ్యక్తిలో దాగి ఉన్న మృగాన్ని బయటపెట్టిన ఆ నిజాలేమిటి?
అమెరికాతో పాటు యావత్ ప్రపంచాన్నీ నివ్వెరపోయేలా చేసిన  జెఫ్రీ డామర్ ఉదంతం....

Jeffrey_Dahmerఅమెరికా... మిల్‌వాకీ కౌంటీ... 25వ వీధి.
కాలింగ్‌బెల్ మోగగానే ఓ ఇంటి తలుపు తెరుచుకుంది.
‘‘రండి సార్. మీకోసమే చూస్తున్నాను. నా పేరు సాండ్రా స్మిత్. మీకు ఫోన్ చేసింది నేనే’’ అంది తలుపు తీసిన పద్దెనిమిదేళ్ల అమ్మాయి. గుమ్మంలో నిలబడివున్న పోలీసులు ఆమె వెంట లోనికి నడిచారు. ఆ అమ్మాయి వాళ్లని బెడ్రూములోకి తీసుకెళ్లింది. మంచమ్మీద పడుకుని ఉన్నాడు ఓ కుర్రాడు. 17-18 సంవత్సరాల మధ్య ఉంటుంది వయసు. ఒంటికి బ్లాంకెట్ చుట్టివుంది. మంచం పక్కనే మరో అమ్మాయి నిలబడి ఉంది.
‘‘ఎవరో ఏంటో తెలీదు సార్. రోడ్డుమీద నగ్నంగా పరిగెడుతూ కనిపించాడు. మేం ఆపి, పలకరించడానికి ప్రయత్నిస్తే ఏదో చెప్పబోయి స్పృహ కోల్పోయాడు. తీసుకొచ్చి పడుకోబెట్టాం’’ చెప్పింది సాండ్రా.
ఇన్‌స్పెక్టర్ కుర్రాడి ముఖంపై నీళ్లు చల్లాడు. స్పృహలోకి వచ్చిన అతడు పోలీసుల్ని చూడ్డంతోనే- సర్.. ఆ పక్కింట్లో.. అతను..అంటూ గాభరా పడ్డాడు. కానీ ఏదీ సరిగా చెప్పలేకపోయాడు. ఆ అబ్బాయి పరిస్థితి చూసిన ఇన్‌స్పెక్టర్‌కి అర్థమయ్యింది... అతనికేమయ్యిందో! వెంటనే అతణ్ని తీసుకుని పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్స్‌కి చేరుకున్నారు.

ఆక్స్‌ఫర్డ్ అపార్ట్‌మెంట్స్... ఫ్లాట్ నంబర్ 213.
పొడవుగా, అందంగా ఉన్న ముప్ఫయ్యేళ్ల యువకుడు పోలీసులను నవ్వుతూ ఆహ్వానించాడు. వారితో వచ్చిన కుర్రాణ్ని చూసి హాయ్ కోన్‌రాక్, నువ్వేంటి వీళ్లతో...అంటూ పలకరించాడు. నువ్వీ అబ్బాయిని లైంగికంగా వేధించావట. నిజమేనాఅంటూ ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్. వేధింపులా... నోనో... హి ఈజ్ మై ఫ్రెండ్... మా ఇద్దరికీ చాలాకాలంగా సంబంధం ఉంది. ఇప్పుడు కాస్త నామీద కోపంగా ఉన్నాడు... అందుకే అలా చెప్పివుంటాడుఅంటూ నవ్వేశాడతడు. నిజమేనా అన్నట్టుగా ఆ అబ్బాయివైపు చూశాడు ఇన్‌స్పెక్టర్. నిజమేనన్నట్టుగా తలూపాడా అబ్బాయి. ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇన్‌స్పెక్టర్ అడ్డుకున్నాడు.
డీసెంట్‌గా, హాలీవుడ్ హీరోలా హ్యాండ్‌సమ్‌గా ఉన్న అతణ్ని వాళ్లు తప్పుగా ఊహించుకోలేకపోయారు. సారీ యంగ్‌మ్యాన్. పొరపాటు పడ్డాం.అని బయటికి వచ్చేశారు. ఇదేదో హోమోసెక్సువల్ గొడవలే అనుకుని వెళ్లిపోయారు. అదే వాళ్లు చేసిన పొరపాటు. ఇంకాసేపు అతణ్ని ప్రశ్నించినా, కనీసం లోనికి వెళ్లి చూసినా అన్నేళ్ల సర్వీసులో వాళ్లెప్పుడూ చూడని ఘోరాలు వాళ్ల కళ్లబడి ఉండేవి.
ఆరు నెలలు గడిచాయి. అది జూలై 23, 1991.
మిల్‌వాకీలోని 25వ వీధిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే పని జరుగుతోంది. ప్రమాదాలేవీ జరక్కుండా పోలీసు పహారా కూడా ఉంది. డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు జీపులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అంతలో ఓ కుర్రాడు ఆక్స్‌ఫర్డ్ అపార్ట్‌మెంట్స్‌లోంచి బయటికి పరిగెత్తుకొచ్చాడు. ఓ చేతికి సంకెళ్లు వేళ్లాడుతున్నాయి.

అది చూసి, ఎవరో నేరస్తుడు పోలీసుల నుంచి తప్పించుకున్నట్టున్నాడనుకొని వాళ్లు అతణ్ని పట్టుకుని నిలదీశారు. అతడు చెప్పింది వినగానే వాళ్లకి ఆరు నెలల క్రితం జరిగిన విషయం గుర్తొచ్చింది. ఆ రోజు ఇంకో కుర్రాడు ఇలాగే 213 ఫ్లాటులోని వ్యక్తి లైంగికంగా వేధించాడని చెప్పాడు. కానీ వాళ్లిద్దరూ ఫ్రెండ్సని తేలడంతో వదిలేశాం. ఇప్పుడితనూ అలాగే చెబుతున్నాడు. పైగా చేతికి సంకెళ్లు వేసి ఉన్నాయంటే ఆలోచించాల్సిందేఅనుకుంటూ 213కు చేరుకున్నారు. తకుముందులాగే ఆ వ్యక్తి పోలీసులను నవ్వుతూ ఆహ్వానించాడు. కానీ ఈసారి పోలీసులు మాత్రం వేరేలా ప్రవర్తించారు. ఇన్‌స్పెక్టర్ అతణ్ని నిలదీస్తుండగా, సబార్డినేట్ చెక్ చేయడానికి లోనికి వెళ్లాడు.

ఇన్‌స్పెక్టర్ ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతూ, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా వ్యక్తి. కాస్తవుంటే ఇన్‌స్పెక్టర్ కన్విన్స్ అయిపోయేవాడే. కానీ అంతలోనే లోపల్నుంచి సబార్డినేట్ గట్టిగా అరిచాడు... అరెస్ట్ హిమ్అంటూ!  అలర్ట్ అయిన ఇన్‌స్పెక్టర్ అతణ్ని పట్టుకున్నాడు. సబార్డినేట్ కంగారుగా హాల్లోకి వచ్చాడు. అతని ముఖం పాలిపోయింది. భయంతో కనురెప్పలు అదురుతున్నాయి. ఒళ్లంతా చెమటలు కారిపోతున్నాయి. ఏమైందిఅడిగాడు ఇన్‌స్పెక్టర్. వీడు మనిషి కాదు, రాక్షసుడు’... అలా అంటున్నప్పుడు సబార్డినేట్ గొంతు భయంతో వణికింది. క్షణాల్లో ఆక్స్‌ఫర్డ్ అపార్ట్‌మెంట్స్‌ను పోలీసులు చుట్టుముట్టారు. 213 ఫ్లాట్‌లో అడుగుపెట్టాక కరుకైన ఖాకీ గుండెలు సైతం భయంతో ఉలిక్కిపడ్డాయి.

ఇల్లంతా జల్లెడపట్టారు. ఇంటినిండా చెదురుమదురుగా పడివున్న మానవ అవశేషాలన్నిటినీ మూటకట్టారు. దీనికంతటికీ కారణమైన మానవమృగం చేతికి సంకెళ్లు వేసి కటకటాల్లోకి నెట్టారు. ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది. అయితే ఎంత ప్రయత్నించినా నిందితుడి నుంచి ఒక్క నిజాన్ని కూడా రాబట్టలేకపోయారు పోలీసులు. ఇక లాభం లేదని, కరడుగట్టిన నేరస్తులను డీల్ చేయడంలో నిష్ణాతుడైన డిటెక్టివ్ ప్యాట్రిక్ కెనడీని సీన్లోకి తెచ్చారు. ఆయన తనదైన శైలిలో నిందితునితో మాట్లాడాడు. ఆ మాటల జాలంలో పడి అతడు తనకు తెలియకుండానే తనకు సంబంధించిన నిజాలన్నీ బయటపెట్టాడు. ఏమిటా నిజాలు? అసలింతకీ ఎవరీ నిందితుడు?

జెఫ్రీ డామర్... 213 ఫ్లాట్‌లో టై్ సృష్టించిన నరరూప రాక్షసుడు.
1960, మే 21న పుట్టిన జెఫ్రీ చాలా చురుకైన కుర్రాడు. అయితే డబుల్ హెర్నియాకుగాను చిన్నతనంలో జరిగిన ఓ ఆపరేషన్ అతడి చురుకుదనాన్ని హరించేసింది. ఆపరేషన్ తర్వాత ఎందుకో జెఫ్రీ డల్ అయిపోయాడు. చదువులో వెనకబడ్డాడు. డిప్రెషన్ ెపెరిగి చివరికి తల్లిదండ్రులతో సైతం మాట్లాడటం మానేశాడు. కారణమేంటో తల్లిదండ్రులకు అంతుబట్టలేదు. అంతవరకూ ఉన్న ప్రాంతాన్ని వదిలి కొత్తచోటికి రావడంతో, ఇమడలేకపోతున్నాడనుకున్నారు. కానీ అసలు కారణం అది కాదని, ఆ లేత మనసులో అప్పుడప్పుడే కొన్ని క్రూరమైన ఆలోచనలు రెక్కలు విప్పుకుంటున్నాయని తెలుసుకోలేకపోయారు.
జెఫ్రీ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాడు. చదువు నచ్చేది కాదు. రోడ్లవెంట తిరిగేవాడు. ఓసారి అతనికి రోడ్డుమీద ఓ కుక్కపిల్ల కళేబరం కనిపించింది. దాన్ని రహస్యంగా ఇంటికి తీసుకొచ్చాడు. ముక్కలుగా కోసి ఎముకల్ని దాచుకున్నాడు. మాంసాన్ని చెత్తకుండీలో పారేశాడు. అప్పట్నుంచీ జంతు కళేబరాలు తెచ్చి ఇలాగే చేసేవాడు. వయసు పెరిగేకొద్దీ జెఫ్రీలో లైంగికేచ్ఛ పెరిగిపోయింది. మగవాళ్లని చూస్తే ఆ కోరిక వికృతరూపం దాల్చేది. 18 యేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి వెళ్లిపోయింది. తండ్రి బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఇంటికి తక్కువగా వచ్చేవాడు. దాంతో జెఫ్రీకి స్వేచ్ఛ దొరికింది. ఓరోజు తన స్నేహితుడిని పార్టీ చేసుకుందాం రమ్మంటూ ఇంటికి పిలిచాడు. ఇద్దరూ బాగా తాగారు.
తర్వాత స్నేహితుడు వెళ్లిపోతానన్నాడు. జెఫ్రీ ఉండమన్నాడు. కుదరదనడంతో స్నేహితుడిని చంపేసి, అతని మృతదేహంతో సంభోగం జరిపాడు. తర్వాత ముక్కలు చేశాడు. తలను నీటిలో ఉడికించి, చర్మాన్ని ఒలిచి షోరూమ్‌లో బొమ్మ మాదిరిగా రంగు వేసి దాచుకున్నాడు. శరీరపు భాగాల్ని కాల్చి బూడిద చేశాడు. కొన్ని రోజుల తర్వాత జెఫ్రీ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చినావిడ జెఫ్రీని ప్రేమగా చేరదీసింది. ఊరికే తాగి తిరగకూడదంటూ నచ్చజెప్పి కాలేజీలో చేర్పించింది. రెండో సెమిస్టర్ నాటికి మళ్లీ పాత పాటే పాడాడు. లాభం లేదని తండ్రి అతణ్ని ఆర్మీలో చేర్పించాడు. కానీ ఇష్టమొచ్చినట్టు తాగుతున్నాడంటూ తొలగించారు. కొన్నాళ్లు నానమ్మ దగ్గరున్నాడు. అక్కడ కూడా తన పైశాచికత్వానికి ఇద్దరిని బలి తీసుకున్నాడు. ఆపైన తనకు ఏ అడ్డూ ఉండకూడదని సొంతగా ఫ్లాట్ తీసుకున్నాడు. దాంతో అతని వికృత చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అతనిలోని శాడిజం మూడేళ్లపాటు బుసలు కొట్టింది. పదిహేడు మంది యువకుల జీవితాలను కాటు వేసింది.

అతడు మనిషి కాదు మృగమంటూ దుమ్మెత్తిపోశారు. జెఫ్రీ ఘాతుకాలకి బలైపోయిన యువకుల తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. కొన్నాళ్లుగా కనిపించకుండా పోయిన తమ బిడ్డల్ని మనిషి రూపంలో ఉన్న ఆ క్రూరమృగం పైశాచికంగా తన పాదాలకింద నలిపేసిందని తెలిసి తట్టుకోలేకపోయారు. వారి ఆవేదనను కోర్టు అర్థం చేసుకుంది. జెఫ్రీ చేసిన ఘాతుకాలను లెక్కగట్టింది. దయ అంటే ఏమిటో తెలియని ఆ మానవమృగానికి 957 సంవత్సరాల శిక్షను విధించింది. అంటే... జీవితాంతం ఖైదీగానే బతుకుతూ చావాలని, చస్తూ బతకాలని!

జైలుకెళ్లాక జెఫ్రీ కొంత మారాడు. శ్రద్ధగా బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. జైలు అధికారుల అనుమతితో బాప్తీస్మం తీసుకున్నాడు. జైలు ఆవరణలో ఉన్న చర్చిలోనే ఎక్కువగా గడిపేవాడు. కానీ ఆ మార్పు అతనిని కాపాడలేకపోయింది. అతని మృత్యుకోరలకు బలయిన అమాయక యువకుల శాపమో ఏమో... రెండేళ్లలో ఆ మృత్యువు అతడినే వెతుక్కుంటూ వచ్చింది! తీవ్రమైన కసితో తన తోటి ఖైదీ చేసిన దాడిలో జెఫ్రీ తీవ్రంగా గాయపడ్డాడు. మానవత్వమన్న మాటకి రక్తపు మరకను అద్దిన ఆ సీరియల్ కిల్లర్... ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే తుదిశ్వాసను వదిలేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Morgan robertson sinking of the titan general
Rare people of the world  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles