The Biography Of Tanguturi Anjaiah Who Was 8th Chief Minister Of Andhra Pradesh State

Tanguturi anjaiah biography andhra pradesh 8th chief minister

Tanguturi Anjaiah, Tanguturi Anjaiah biography, Tanguturi Anjaiah photos, Tanguturi Anjaiah history, andhra pradesh chief ministers

Tanguturi Anjaiah Biography Andhra Pradesh 8th Chief Minister : The Biography Of Tanguturi Anjaiah Who Was 8th Chief Minister Of Andhra Pradesh State

ఆంధ్రరాష్ట్రానికి 8వ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అంజయ్య

Posted: 08/22/2015 02:55 PM IST
Tanguturi anjaiah biography andhra pradesh 8th chief minister

విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారిలో టంగుటూరి అంజయ్య ఎనిమిదవ వారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన.. కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కార్మిక నాయకునిగా, ఆ తర్వాత కేంద్ర కార్మిక మంత్రిగా ఎదిగారు. అనంతరం సీఎం స్థానాన్ని చేజిక్కించుకునే స్థాయికి ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ఈయన 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు పనిచేశారు

జీవిత విశేషాలు :

1919 ఆగష్టు 16వ తేదీన హైదరాబాద్ నగరంలో అంజయ్య జన్మించారు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది మెదక్ జిల్లాలోని భానూర్ గ్రామం. అయితే వృత్తిరీత్యా వారి కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. ఆంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నారు. ఆర్థిక కారణాల వల్ల తన విద్యాభ్యాసాన్ని ఆపేసి.. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఈయన ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కష్టాలను సవాల్ చేస్తూ తన జీవితాన్ని ముందుకు కొనసాగించారు. ఆనాడు ఆయన పడిన కష్టమే ఆయన్ను కార్మిక నాయకునిగా ఎదిగేలా చేసింది. ఇక అక్కడి నుంచి ఆయన తన ప్రతిభతో, తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదుగుతూ.. కేంద్ర కార్మిక మంత్రి స్థాయికి చేరుకున్నారు. కాంగ్రెసు పార్టీకి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు కూడా!

ముఖ్యమంత్రిగా :

1980లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో.. కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గం ఆయన్ను తొలగించి, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కార్మిక శాఖామంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య.. వివిధ వర్గాలవారికి మంత్రివర్గంలో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన 61 మంది మంత్రులతో భారీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా జంబో మంత్రివర్గమని పిలిచేవారు. అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి. అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం కొన్ని మంచి కార్యక్రమాలను ఆనాడు చేపట్టారు. ముఖ్యమంత్రిగా కేవలం 16 నెలలపాటు కొనసాగినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించారు.

ఎదుర్కొన్న ఆరోపణలు :

ఈయన మంత్రివర్గంలో మంత్రుల సభ్యుల ఎక్కువగా వుండటంతో.. కొందరిని తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడి తెచ్చింది. దీంతో చేసేదేమీ లేక ఆయన కొందరిని తొలగించాల్సి వచ్చింది. అయితే.. తొలగించినవారిని సంతృప్తి పరచడం కోసం ఎన్నో నిరూపయోగమై కార్పొరేషన్లు సృష్టించి.. వారికి పదవులిచ్చారు. అంతేకాదు.. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద భారీగా ఖర్చు చేశారు. దీంతో ఆయన ప్రభుత్వంలోనూ అసమ్మతి వర్గం పెరిగిపోయిందని.. ఆయన్ను అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది. ఆ తర్వాత 1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tanguturi Anjaiah  andhra pradesh chief ministers  

Other Articles