rakesh sharma Hero of the Soviet Union | Indians who to travel in space

Rakesh sharma hero of the soviet union biography

Rakesh Sharma news, Rakesh Sharma updates, Rakesh Sharma photos, Rakesh Sharma wing commander, Rakesh Sharma biography, Rakesh Sharma history, Rakesh Sharma life story, Hero of the Soviet Union, indians travel in space, space india travels

rakesh sharma Hero of the Soviet Union biography : The Biography of Rakesh Sharma who was the first Indian to travel in space. He named as Hero of the Soviet Union by russia government after travel in space.

అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి

Posted: 04/03/2015 10:38 AM IST
Rakesh sharma hero of the soviet union biography

రాకేశ్ శర్మ.. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డులపుటకెక్కాడు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని మొదట వైమానిక దళంలో చేరిన రాకేశ్.. తన ప్రతిభతో చకచకా ఉన్నత పదవులు పొంది.. స్క్వాడ్రన్ లీడర్, ‘విమాన చోదకుడు’ అయ్యాడు. 1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా)కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి.. ‘బైకనూర్’ అంతరిక్ష కేంద్రం నుంచి ఇతను అంతరిక్షంలోకి వెళ్లాడు. ఇలా ఈ విధంగా మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన ఈయన.. ఇంతవరకు ఆ ప్రయాణం చేసిన ప్రపంచపు వ్యోమగాములలో 138వ వాడిగా నిలిచాడు.

జీవిత చరిత్ర :

1954 సం.లో పాటియాలాలో రాకేశ్ శర్మ జన్మించాడు. చదువుకునే రోజుల్లో అన్నింటిలోనూ ముందుండే రాకేశ్.. మొదట భారత వైమానిక దళంలో చేరాడు. అయితే.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం జీవితంలో ఏదైనా సాధించాలన్న కాంక్షతో రాకేశ్ తన ప్రతిభతో స్క్వాడ్రన్ లీడర్, ‘విమాన చోదకుడు’ అయ్యాడు.

అంతరిక్ష యాత్ర :

భారతదేశానికి చెందిన ‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ’ (ISRO), రష్యాకు చెందిన ‘సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్’ (ఇంటర్ కాస్మోస్) సమన్వయంలో అంతరిక్షయాత్ర సాల్యూట్-7 రోదసీ స్టేషనులో 8 రోజులపాటు కొనసాగింది. ఈ యాత్రలో 35 యేళ్ళ రాకేష్ శర్మతో పాటు రష్యాకు చెందిన ఇరువురు వ్యోమగాములు ప్రయాణించారు. వీరియాత్ర ‘సోయుజ్ టి-11’ లో 1984 ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభమయింది. ఈ ప్రయాణ సమయంలో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ‘భారతదేశం ఎలా కనిపిస్తుంది?’ అని అడిగిన ప్రశ్నకు రాకేష్ శర్మ ‘సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా’ అని సమాధానం చెప్పి దేశభక్తిని చాటి చెప్పాడు.

రోదసీ నుండి తిరిగొచ్చిన అనంతరం రష్యా ప్రభుత్వం రాకేశ్ శర్మను ‘హీరో ఆఫ్ సోవియట్ యూనియన్’ అనే బిరుదు ఇచ్చి గౌరవించింది. ఇక భారతదేశం కూడా రాకేష్ శర్మతోపాటు  అంతరిక్షంలో ప్రయాణించిన ఇరువురు రష్యన్ వ్యోమగాములనూ ‘అశోక చక్ర’ అవార్డులతో సత్కరించింది. రాకేష్ శర్మ ప్రస్తుతం పదవీ విరమణ పొందాడు. ఇదిలావుండగా.. అంతరిక్షణ ప్రయాణ సమయంలో రాకేష్ శర్మ హిమాలయాలలో జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టులకు సంబంధించిన ఛాయాచిత్రాలను తీశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero of the Soviet Union  Rakesh Sharma  indians travel in space  

Other Articles