Legendary musician ravi shankar

Pandit Ravi Shankar,Legendary musician,RaviShankar,Paithan,Maihar-Senia,Divine Nada,Devagiri court,brahman,Baba Allauddin Khan,

Your columnist first saw Pandit Ravi Shankar from the window of a chawl overlooking Grant Road station. The maestro was walking rapidly towards platform one carrying his signature sitar and my father, who was just two years older than the sitarist, pointed him out to me. A few months later, father took me to an impromptu concert held in the apartment below my uncle's flat in Tardeo.

Legendary musician Ravi Shankar.png

Posted: 12/19/2012 10:48 AM IST
Legendary musician ravi shankar

Ravi_shankerభారతీయ సంగీతం అలంకార ప్రధానమైనది. ఇందులో నాటకీయత లేదు. అతి నెమ్మదిగా మొదలై వేగమైన ముగింపును ఇస్తుంది. ఈ ప్రయాణంలో అతి సంక్లిష్టమైన లోతుల్ని చూపు తుంది. ఒక రాగంలో ఉన్న స్వరాల ద్వారా అనుభూతుల్ని ప్రేక్షకులకి ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు సంగీతకారుడు. అలాంటి వారిలో సితార తంత్రులు మీటి గంధర్వులను మంత్ర ముగ్థులనుచేసే పండిట్‌ రవిశంకర్‌ ఒకరు. సితార్‌ అనగానే మనందరికీ ఠక్కున గుర్తొచ్చేది మాత్రం పండిట్‌ రవిశంకరే. దేశ విదేశాలలో సితార్‌పై ఆయన చేసిన ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టారు. అంతర్జాతీయ వేదికలపై లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమంది విదేశీయుల అభిమానాన్ని సైతం సంపాదించారు. భారతీయ సంగీతాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. హిందుస్తానీ సంగీతానికి ఎనలేని కీర్తిని తీసుకురావడంలోనూ, భారతీయ సంప్రదాయ సంగీతాన్ని ప్రపంచానికి చాటడంలోనూ పండిట్‌ రవిశంకర్‌ చేసిన కృషి అజరామరం. సంగీతకారుడిగా, కంపోజర్‌గా ప్రసిద్ధి చెందిన రవిశంకర్‌ భారత సంగీత రాయబారిగా పేరు సంపాదించారు. సంగీత ప్రపంచంలో విభిన్నమైన స్టయిల్స్ ని రవిశంకర్‌ కొనసాగించారు. 92 సంవత్సరాల వయస్సులో కూడా గ్రామీ అవార్డుల కోసం రవిశంకర్‌ పోటీ పడ్డారు. ఈయన ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.

అసలు పేరు      : రబీంద్రో శౌంకోర్‌ చౌదురి
జననం           : ఏప్రిల్‌ 7, 1920 (92)
ప్రదేశం            : గాజీపూర్‌, వారణాసి, ఆవథో సంస్థానం,
మరణం           : డిసెంబర్‌ 12, 2012
ప్రదేశం            : శాంటియాగో, కాలిఫోర్నియా అమెరికా
సాహిత్యం          : హిందుస్తానీ సంగీతం
వృత్తి               : కంపోజర్‌, సితార్‌ విద్వాంసుడు
వాయిద్యాలు       : సితార్‌
రికార్డు కంపెనీలు   : ఏంజిల్‌, డార్క్‌ హార్స్‌ రికార్డ్‌‌స, హెచ్‌ఎంపి

జీవన పయనం

సంగీతంలోని అందం, బిగి, ఉద్రేకం చూపిస్తూ సంగీతం ఘనత చూపించే విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌. సంగీతంలో భక్తి సంగీతాన్ని చేర్చడంలో పాటు 20 శతాబ్దంలో భారతీయ సంగీతాన్ని అత్యున్నత స్థాయికి చేర్చిన ఘనత ఆయనదే. సుప్ర సిద్ధ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ గురించి తెలియని భారతీ యడు ఉండడు. రవిశంకర్‌ అసలు పేరు రబింద్రో శౌంకోర్‌ చౌదురి. రవిశంకర్‌ ఆ కుటుంబంలో 7వ సంతానం. బెంగాలీ బ్రాహ్మిన్‌. తండ్రి శ్యామ్‌ శంకర్‌, తల్లి హేమాంగినీ దేవి. ఈమె లండన్‌లో న్యాయవాదిగా ఉండేది. తల్లి, తండ్రి విడిపోయాకా తల్లి రెండో పెళ్ళి చేసుకుని రవిశంకర్‌ను వారణాశిలో పంపేశారు.1949 నుంచి 1956 వరకూ సంగీత దర్శకుడిగా ఢిల్లీ ఆల్‌ఇండియా రేడియోకు పనిచేశారు. 1956 నుంచి యూరప్‌, అమెరికాలో హిందుస్థాని క్లాసికల్‌ సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ఆరంభించారు. రవిశంకర్‌ ప్రముఖ విద్వాంసుడు యోహుదీతో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. హిందుస్థానీ సంగీతంలో కర్ణాటక సంగీతాన్ని మిళితం చేస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. బోధన, ప్రదర్శనల ద్వారా హిందుస్థాని క్లాసికల్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన కుమార్తె అనౌష్క శంకర్‌తో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 2003లో అనౌష్క తన మ్యూజిక్‌ ఆల్బమ్‌ ద్వారా ‘గ్రామీ’ అవార్డుకు నామినేట్‌ అయ్యింది.

Pandit_Ravi_Shankarకుటుంబ నేపథ్యం

పండిట్‌ రవిశంకర్‌కు భార్య సుకన్య, ఇద్దరు కుమార్తెలు. అనుష్కా శంకర్‌, గాయని నోరహ్‌ జోన్స్‌. ఇద్దరూ కూడా సితార విద్వాంసులే. రవిశంకర్‌కు తోడుగా ఉండే కుమారుడు సుభేంద్ర శంకర్‌ 1992లో మరణించాడు. సంగీత వారధిగా ఉన్న పండిట్‌ రవిశంకర్‌ జీవితంలో వివాహాలు ఎక్కువే. 1941లో అల్లావుద్దీన్‌ఖాన్‌ కుమార్తె అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. వీరికి 1942లో సుబేంద్రశంకర్‌ అనే కుమారుడు పుట్టాడు. తరువాత నర్తకి కమల్‌శాస్త్రితో కలసి ఉన్నారు. తరువాత 1976లో న్యూయార్క్‌లో ఉన్న ప్రోగ్రాం నిర్మాత జోన్స్‌తో సంబంధం పెట్టుకుని నోరా జోన్స్‌కు 1979లో జన్మనిచ్చారు. 1981లో కమలాశాస్త్రి నుండి వేరుపడి... 1989లో సుకన్య రాజన్‌ను పెళ్లి చేసుకున్నారు.

పురస్కారాలు

సితార్‌తో అనేక ప్రయోగాలు, ప్రదర్శనలు జరిపిన పండిట్‌ రవిశంకర్‌కు అనేక పురస్కారాలు లభించాయి. వీటితో పాటు సంగీతంలో విశేష ప్రతిభకనబరిచిన వారికి ఇచ్చే ‘‘గ్రామీ’’అవార్డులుందుకున్నారు. 1957 బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ లో ‘కాబూలీవాలా’ సినిమాకు గాను జ్యూరీ అవార్డులు లభించాయి. ప్రత్యేక పురస్కారం1962లో సంగీత నాటక అకాడమీ అవార్డ్‌ ,  1967లో పద్మభూషణ్‌ అవార్డు, 1975లో యునెస్కో సంగీత పురస్కారం,    1981లో పద్మవిభూషణ్‌ అవార్డు, 1988లో కాళిదాస్‌ సమ్మాన్‌ పురస్కారం, 1991లో ఫుకౌకా ఆసియన్‌ కల్చర్‌ ప్రైజ్‌,    1992లో రామన్‌ మెగసేసే అవార్డు, 1998లో పోలార్‌ మ్యూజిక్‌ ప్రైజ్‌, 1999లో భారతదేశ పురస్కారం భారతరత్న,1986లో రాజ్యసభ నామినేట్‌ సభ్యుడిగాను, 2010లో గౌరవ డాక్టరేట్‌ను ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ మెల్‌బోర్న్‌ నుండి, 2011లో కల్చర్‌ లెగసి అవార్డు లు పొందాడు.

Ravi_Shankarవిశేషాలు

సారే జహాసే అచ్చా పాటను 1950లో రీ ట్యూన్‌ చేశారు.  ‘బీటిల్స్‌’ చెందిన జార్జి హారిసన్‌తో కలవడం రవిశంకర్‌కు పాశ్చాత్య దేశాల్లో బాగా పేరు తెచ్చింది. అమెరికా అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌ ఆహ్వానంతో రవిశంకర్‌ వైట్‌హౌస్‌లో సితార్‌ వాయించారు. 194950లో ఆల్‌ ఇండియా రేడియోలో కర్ణాటక, హిందూస్తానీ సంగీతాన్ని ప్రవేశపెట్టారు.   1982లో ‘గాంధీ’ సినిమాకు బెస్ట్‌ మ్యూజిక్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యారు. రాజీవ్‌గాంధీ రవిశంకర్‌ను రాజ్యసభ సభ్యుడిగా (19861992) ప్రముఖల విభాగంలో నామినేట్‌చేశారు. సత్యజిత్‌రే నిర్మించిన పథేర్‌ పాంచాలి చిత్రానికి రవిశంకర్‌ అందించిన సంగీతం ప్రపంచ సినిమా సంగీతంలో చిరస్మరణీయంగా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director bapu special
Mallemala sundara rami reddy vardhanthi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles