Susarla title 1gif

susarla-title-1.gif

Posted: 02/11/2012 03:15 PM IST
Susarla title 1gif

susarla-title

susarla

గానకోకిల లతా మంగేష్కర్ చేత "నిదురపోరా తమ్ముడా.." అంటూ ఎన్నటికీ మర్చిపోలేని గానాన్ని ఆలపింపింపచేసిన సుస్వరాల ఆరాధకుడు సుసర్ల దక్షిణామూర్తి ఫిబ్రవరి 9 న శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆయనని తెలుగు సరస్వతి ఎట్టకేలకు తన అక్కున చేర్చుకుంది. తెలుగు తమిళంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎఎమ్ రాజాలతో సంసారం చిత్రం కోసం గానం చేయించిన "సంసారం సంసారం", ఇలవేల్పులోని "చల్లని రాజా ఓ చందమామ", తాను స్వయంగా పాడిన "చల్లని పున్నమి వెన్నెలలోనే" కలకాలం గుర్తుండే గానాలు. నర్తన శాలలో "జననీ శివకామిని", "ఎవరికోసం ఈ మందహాసం", "సలలిత రాగ సుధారస సారం" పాటలు తెలుగు ఉన్నంతకాలం సజీవంగా ఉంటాయి.

susarla-21921 నవంబర్ 11 న కృష్ణాజిల్లా పెద్ద కళ్ళేపల్లి గ్రామంలో సంగీత సరస్వతీ నిలయమైన కుటుంబంలో జన్మించిన సుసర్ల దక్షిణామూర్తి, సంగీత విధ్యాంసుడు, సంగీతోపాధ్యయుడైన సుసర్ల కృష్ణబ్రహ్మ శాస్త్రి, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. తన పేరుని ప్రసాదించిన తాత సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి కర్ణాటక సంగీతంలో ఉద్దండులు.

సుసర్ల చిన్నతనంలో తాతగారి దగ్గర సంగీతం నేర్చుకోవటానికి దూరప్రాంతాల నుంచి వచ్చి ఇంటిలో ఉండే బీద పిల్లలతో నిండి ఉండేది. పుట్టిన దగ్గర్నుంచే సంగీత వాతావరణం ప్రభావం ఊరికే పోతుందా. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే సుసర్ల మచలీపట్నంలోని నవరాత్రి ఉత్సవాల్లో ఇతర గాయకులతో కూడి వయొలిన్ మీద సంగీత ప్రదర్శననిచ్చారు.

1938లో హిజ్ మాస్టర్స్ వాయిస్ (హెచ్ ఎమ్ వి) లో సుసర్ల హార్మోనియం వాయిద్యకారునిగా పనిచేసారు. ఆలిండియా రేడియోలో ఎ గ్రేడ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన ఈయనను న్యూఢిల్లీ రేడియో స్టేషన్ లో దక్షిణ భారత సంగీత విభాగానికి డైరెక్టర్ పనిచేయటానికి ఆహ్వానించారు.

ఆ తర్వాత దక్షిణామూర్తి మద్రాసులో సినిమా రంగంలో సిఆర్ సుబ్బురామన్ దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరక్టర్ గా ప్రవేశించారు. 1946 నుంచి 1984 వరకూ 14 తెలుగు చిత్రాలతో అనుబంధమున్న సుసర్ల లైలా మజ్నూ, పరమానందయ్య శిష్యుల కథ, శ్రీ లక్ష్మమ్మ కథ, సర్వాధికారి, సంతానం, ఇలవేల్పు సినిమాల్లో సంగీత దర్శకత్వమే కాకుండా నేపధ్య గాయకుడికిగా కూడా పనిచేసారు.

సినిమా అనుబంధంతో ఎంతోమంది చేసినట్టుగానే సుసర్ల దక్షిణామూర్తి కూడా రెండు సినిమాలు తీసి చెయికాల్చుకున్నారు. అవి, 1960 లో తీసిన మోహినీ రుక్మాంగద, 1962లో నిర్మించిన రమా సుందరి చిత్రాలు. నర్తన శాలతో ఎన్టీఆర్ అభిమానానికి పాత్రులైన సుసర్ల ఆయన కోరిక మీద శ్రీమద్విరాట పర్వం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్ర సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు.

చక్కెర వ్యాధి వలన 1972లో ఒక కన్ను చూపు పోగొట్టుకున్న సుసర్ల 1987 లో రెండవ కంటి చూపు కూడా పోగొట్టుకున్నారు. ఫిబ్రవరి 9 2012 న చెన్నైలో సంగీత ప్రియులందరినీ వదిలి అనంతలోకాలకు వెళ్ళిపోయారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని కాంక్షిస్తూ, మధుర ఙాపకాలను, మధుర గానాలతోపాటు ఆయన ఇక్కడే వదిలి వెళ్ళిన కుటుంబ సభ్యలు, సంగీతాభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన ఎడబాటుని తట్టుకునే శక్తిని ప్రసాదించమని భగవంతుని కోరుతూ- తెలుగువిశేష్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with gundu hanumantha rao
Singer ghantasala exclusive story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles