MLC Deepak Reddy Grabbed Telangana Government Land

Deepak reddy scam effect on kcr s project

Anantapur MLC Deepak Reddy, Deepak Reddy KCR, KCR Deepak Reddy, Double Bed Room Scheme Deepak Reddy, Deepak Reddy Forgery, Anantapur MLC Hyderabad Scam, KCR Land Grab Scam

Anantapur MLC Deepak Reddy Land Grab hit KCR's Double Bed Room Scheme. Forged Papers 45 Acers at Gudi Malkapur Government Land

భూ భాగోతం.. టీ సర్కార్ స్కీంకే ఎర్త్!

Posted: 06/10/2017 02:20 PM IST
Deepak reddy scam effect on kcr s project

ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైదరాబాద్ లో చేసిన భూ అక్రమణ దందా పెను సంచలనంగానే మారిన విషయం తెలిసిందే. అనంతపురం ఎమ్మెల్సీ అనుచరులు కలిసి వేల కోట్లు విలువ చేసే భూమిని అప్పణ్ణంగా తమ పేరు రాయించుకోవటం, అది వెలుగులోకి వచ్చి అరెస్ట్ ల పర్వం, తనకేం సంబంధం లేదని అనవసరంగా ఇరికించారని వాదిస్తూ వస్తున్నాడు. అయితే ఈ భూ దందాలో ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

కేసీఆర్ కలల పథకం డబుల్ బెడ్రూం కు సంబంధించిన భూములను కూడా చాలా తెలివిగా స్వాహా చేశాడంట దీపక్ రెడ్డి. మెహదీపట్నం సమీపంలోని గుడిమల్కాపూర్ దగ్గర 45 ఎకరాల భూమిని తన పేరిట రాయించేసుకున్నాడు. అధికారులు కూడా గుడ్డిగా దానిని కట్టబెట్టినట్లు చెబుతున్నప్పటికీ, సీఎం పేషీలోని కొందరు దీని వెనుక ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగానే ముడుపులు కూడా ముట్టజెప్పినట్లు భోగట్టా.

సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా వెళ్లేందుకు వాళ్లపైనా పక్కా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇంకోవైపు ఇందులో ఉన్న మంత్రుల హస్తం, అధికారుల హస్తంపై కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో నిజాలు నిగ్గు తేలితే మాత్రం రాజయ్యకు పట్టిన గతే పడుతుందని కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే సూచన ప్రాయంగా చెబుతున్నారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anantapur  MLC Deepak Reddy  Double Bed Room Scheme  

Other Articles